ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేసులు రిఫర్‌ చేస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-04-30T00:37:05+05:30

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే కేసులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ వైద్యాధికారులను హెచ్చ రించారు. ఆరోగ్యశ్రీ సేవలు, పాటించవలసిన నియమాలపై వైద్యాధికారులతో జేసీ శనివారం సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే కేసులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ వైద్యాధికారులను హెచ్చ రించారు. ఆరోగ్యశ్రీ సేవలు, పాటించవలసిన నియమాలపై వైద్యాధికారులతో జేసీ శనివారం సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సేవలపై గ్రామస్థాయిలో ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగే టట్లు చూడాలన్నారు. ప్రతీ ఆసుపత్రిలో నిర్దేశించిన సౌకర్యాలు, సేవలు, వైద్యులు, సిబ్బంది ఉండా లన్నారు. లేని వాటిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో మీనాక్షిని ఆదేశించారు. బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త పి.ప్రకాశరావు మాట్లాడుతూ.. మే 1నుంచి ప్రతీ ఆరోగ్య శ్రీ మిత్రా కూడా ఆసుపత్రుల్లో బెడ్‌ మీద ఉన్న పేషెంట్‌ వద్దకు వెళ్లి ఫొటోను తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ జె.భాస్కరరావు, ప్రభుత్వ, ప్రైవే టు ఆసుపత్రుల వైద్యాధి కారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-30T00:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising