ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యంతోనే చంద్రబాబుపై ఆరోపణలు

ABN, First Publish Date - 2023-09-04T23:54:31+05:30

వివిధ సర్వేల్లో వస్తున్న ఫలితాలతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

పొందూరు, సెప్టెంబరు 4: వివిధ సర్వేల్లో వస్తున్న ఫలితాలతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో సోమవారం టీడీపీ కా ర్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మా ట్లాడారు. మద్యం, ఇసుక, మైనింగ్‌ తదితర వాటిల్లో భారీ అవినీతిలో కూరుకు పోయిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వం వాటి నుంచి దృష్టి మరల్చేం దుకే చంద్రబాబుపైనా, లోకేష్‌పైనా తప్పడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. చెల్లెలను, తల్లిని పట్టించుకోని జగన్‌రెడ్డి మహిళలను ఉద్దరించినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పుడు దారిలో గెలవడానికే బీఎల్‌వోలపై ఒత్తిడి తీసుకువచ్చి ఓటరు లిస్టుల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు నకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలన్నారు. ఈయనతోపాటు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, పార్టీ మండల ఉపాధ్యక్షుడు బాడాన గిరి, కార్యకర్తలు ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

జి.సిగడాం, సెప్టెంబరు 4: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభు త్వానికి రోజులు దగ్గరపడ్డా యని మహాశక్తి సమన్వయ కర్త గంటా సంధ్యా గజపతిరాజు అన్నారు. సోమవారం వాండ్రంగిలో మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని పథకాలను మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు జె.శ్రీనివాసరావు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising