ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. రైళ్లు రద్దు

ABN, First Publish Date - 2023-06-03T00:21:08+05:30

రిసా రాష్ట్రం బాలాసోర్‌ వద్ద శుక్రవారం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగిఉన్న గూడ్స్‌ రైలును ఢీకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- శ్రీకాకుళం రోడ్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

ఆమదాలవలస, జూన్‌ 2: ఒరిసా రాష్ట్రం బాలాసోర్‌ వద్ద శుక్రవారం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగిఉన్న గూడ్స్‌ రైలును ఢీకొంది. దీంతో శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాల వలస) మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని రైల్వే అధికారులు దారి మళ్లించారు. ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌లో సహాయకేంద్రం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 11.30 గంటలకు రావాల్సిన హౌరా-చెన్నై(12839) మెయిల్‌తో పాటు ఉదయం 10.10 గంటలకు రావాల్సిన హౌరా-యశ్వంత్‌పూర్‌ (12836) రైళ్లను రద్దు చేశారు. అస్సాం వెళ్లే గౌహతి (1259) ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి వాస్కోడిగామా (18047) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ విజయనగరం మీదుగా దారి మళ్లించారు. శుక్రవారం భువనేశ్వర్‌ నుంచి వచ్చే ఈస్టు కోస్టు కొంత ఆలస్యంగా నడిచింది. రైల్వే నెంబర్లు 85911, 85912, 85913, 85914తోపాటు 08942 286213, 08942 286245 ఫోన్‌ నెంబర్లులో ప్రయాణికులు సంప్రదించాలని కోరారు.

Updated Date - 2023-06-03T00:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising