25 నుంచి స్కూల్స్‌గేమ్స్ ఎంపికలు
ABN, First Publish Date - 2023-09-21T23:58:57+05:30
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈ నెల 25 తేదీ నుంచి వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ రమణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25న అండర్-14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, లాన్‌టెన్నీస్, అర్చరీ పోటీలు, అండర్-14 బ్యాడ్మింటన్ పోటీలు శ్రీకాకుళంలో నిర్వహిస్తామన్నారు. 26న శ్రీకాకుళంలో బాల్‌బాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, ఫెన్నింగ్‌తోపాటు అండర్-14, 17 బ్యాడ్మింటన్ బాలబాలికల పోటీలు జరుగుతాయన్నారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈ నెల 25 తేదీ నుంచి వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ రమణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25న అండర్-14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, లాన్‌టెన్నీస్, అర్చరీ పోటీలు, అండర్-14 బ్యాడ్మింటన్ పోటీలు శ్రీకాకుళంలో నిర్వహిస్తామన్నారు. 26న శ్రీకాకుళంలో బాల్‌బాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, ఫెన్నింగ్‌తోపాటు అండర్-14, 17 బ్యాడ్మింటన్ బాలబాలికల పోటీలు జరుగుతాయన్నారు. ఈ నెల 27న జూడో, బేస్‌బాల్, చెస్, బాక్సింగ్, త్రోబాల్, యోగ, టెన్నీకాయిట్, బాస్కెట్‌బాల్, సపక్‌తక్రా ఎంపికలు జరుగుతాయన్నారు. ఈ నెల 28న టెక్కలిలో వెయిట్ లిఫ్టింగ్ , రగ్బీ, నెట్‌బాల్, రోప్‌బాల్, సాఫ్ట్ టెన్నీస్ ఎంపికలు, 29న అథ్లెటిక్స్, క్రికెట్ ఎంపికలు శ్రీకాకుళంలో నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. ఫ అండర్-19 వాలీబాల్ ఎంపికలు ఈ నెల 23వ తేదీ జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్.రామన్న తెలియజేశారు. 19 ఏళ్ల వయసు లోపు క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలన్నారు.
Updated Date - 2023-09-21T23:58:57+05:30 IST