జగన్‌తో విసిగిపోయిన జనం: రుద్రరాజు
ABN, First Publish Date - 2023-05-02T02:18:13+05:30
‘‘జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారు. జగన్ పాలన హింసాత్మకంగా మారింది. ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ, వారిపై కేసులు పెట్టి బెదిరించడానికే
హిందూపురం, మే 1: ‘‘జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారు. జగన్ పాలన హింసాత్మకంగా మారింది. ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ, వారిపై కేసులు పెట్టి బెదిరించడానికే నాలుగేళ్ల కాలం సరిపోయింది. ప్రజలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు’’ అని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ఆయన.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒక్కసారి అవకాశంతో అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వ ంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. నాలుగేళ్లలో ప్రత్యేక హోదాపై ఒక్కసారైనా మాట్లాడారా? 2024 తరువాత రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేనలో ఒక పార్టీనే మిగిలి ఉంటుంది. ఇటువైపు కాంగ్రెస్ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం’’ అని రుద్రరాజు తెలిపారు. బీజేపీ పాలనను దేశ ప్రజలు చీదరించుకుంటున్నార, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని రుద్రరాజు అన్నారు.
Updated Date - 2023-05-02T02:18:13+05:30 IST