ఆర్యవైశ్య కులానికి వన్నె తెచ్చిన రోశయ్య
ABN, First Publish Date - 2023-07-03T03:23:51+05:30
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆర్యవైశ్య సమాజానికి వన్నె తెచ్చారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
విగ్రహావిష్కరణ సభలో డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి
విజయవాడ(వన్‌టౌన్), జూలై 2: తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆర్యవైశ్య సమాజానికి వన్నె తెచ్చారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. 4న రోశయ్య జయంతిని పురస్కరించుకుని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఆయన విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన రోశయ్య సంస్మరణ సభలో కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, రోశయ్య కుమారుడు శివ సుబ్బారావు, అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, అన్నా రాంబాబు, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-03T04:36:40+05:30 IST