ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘వాల్‌’ మరమ్మతుతో లాభం లేదు

ABN, First Publish Date - 2023-07-21T02:56:37+05:30

వరదలకు దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేస్తే ప్రయోజనం ఉండదని.. కొత్తది నిర్మించుకోవడమే శ్రేయస్కరమని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది.

కొత్తది కట్టడమే శ్రేయస్కరం.. కేంద్రానికి రాష్ట్రం నివేదిక

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): వరదలకు దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేస్తే ప్రయోజనం ఉండదని.. కొత్తది నిర్మించుకోవడమే శ్రేయస్కరమని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపింది. మరమ్మతులా.. కొత్త నిర్మాణమా.. ఈ రెండింటిలో ఏది మంచిదో తేల్చిచెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబర్షి ముఖర్జీ నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ నాలుగైదు రోజులుగా నిర్మాణసంస్థ మేఘా ఇంజనీరింగ్‌తోనూ.. గతంలో డయాఫ్రంవాల్‌ నిర్మించిన జర్మనీ సంస్థ బావర్‌తోనూ సంప్రదింపులు జరిపింది. పాతవాల్‌ను మరమ్మతు చేసినా ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చని.. కొత్తగా సమాంతర వాల్‌ నిర్మించడమే మేలని బావర్‌ తెలిపింది. గురువారం బావర్‌ ప్రతినిధులతో జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకరబాబు చర్చించారు. కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మించేందుకే మొగ్గు చూపుతూ నివేదికను తయారు చేశారు.

Updated Date - 2023-07-21T02:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising