మా పార్టీలో రెడ్లే ఎక్కువ: నారాయణస్వామి
ABN, First Publish Date - 2023-05-31T03:14:18+05:30
తమ పార్టీలో రెడ్లే ఎక్కువగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు.
తిరుపతి, మే 30 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీలో రెడ్లే ఎక్కువగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉంటారని, తాను ఎప్పుడు ఏమి మాట్లాడినా తమ పార్టీలోని వారే చులకనగా చూస్తారని చెప్పుకొచ్చారు. అవేమీ తాను పట్టించుకోనని, తన పంథా తనదేనన్నారు. మంగళవారమిక్కడ మహిళా వర్సిటీలో జరిగిన హౌసింగ్ సమీక్షలో ఆయన మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేదికపై లేకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి అని సంబోధించి.. సారీ సీఎం కాదు.. మంత్రి అని సవరించుకున్నారు. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో కొండలు, గుట్టలపై జగనన్న ఇళ్లకు స్థలాలు కేటాయించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-31T03:14:18+05:30 IST