ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాగింగే పొట్టన పెట్టుకుంది!

ABN, First Publish Date - 2023-02-21T03:27:45+05:30

తమ కుమారుడిని ర్యాగింగ్‌ భూతమే పొట్టన పెట్టుకుందని ఇంజనీరింగ్‌ విద్యార్థి టీ.ప్రదీప్‌ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీకుమారి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్లే రైలు కింద తోసేశారు..

ఇంజనీరింగ్‌ విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

కావలి, ఫిబ్రవరి 20: తమ కుమారుడిని ర్యాగింగ్‌ భూతమే పొట్టన పెట్టుకుందని ఇంజనీరింగ్‌ విద్యార్థి టీ.ప్రదీప్‌ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీకుమారి ఆరోపించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివార్లలో శనివారం రైలు కిందపడి చనిపోయిన ఆర్‌ఎస్సార్‌ కళాశాల ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రదీప్‌ (20) మృతదేహానికి కావలి ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్ట్‌మార్టం చేశారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఆర్‌ఎస్సార్‌ కాలేజీకి తీసుకెళ్లి న్యాయం అడుగుతామంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. పలావు, మద్యం తెచ్చి ఇవ్వాలని, అమ్మాయిల ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని సీనియర్లు ప్రదీ్‌పను వేధించారన్నారు. దానిని తట్టుకోలేకే కాలేజి మానేస్తానని ప్రదీప్‌ చెప్పేవాడని ఆవేదన చెందారు. శివరాత్రికి ముందు తాను కళాశాల మానేస్తున్నట్లు చెప్పడంతో ఎక్కడ విషయం బయటకు వస్తుందోనని తమ కుమారుడిని రైలు కిందకు తోసి చంపేశారని ఆరోపించారు. సదరు కళాశాల ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డిది కావడంతో కేసును ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మృతదేహాన్ని కాలేజీ వద్దకు తీసుకు వెళతామని తల్లిదండ్రులు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వే శాఖ నుంచి కేసును తాము తీసుకుని విచారిస్తామని, న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-02-21T03:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising