శ్రీశైలంలో పూర్ణాహుతి
ABN, First Publish Date - 2023-01-18T03:38:21+05:30
శ్రీశైలంలో ఏడు రోజుల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం స్వామి,
నేడు అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం
మల్లన్న హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు
శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో ఏడు రోజుల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహదాశీర్వచనం జరిపించారు. నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన దర్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అర్చకులు, వేదపండితులు వసంతోత్సవం జరిపించారు. చండీశ్వరస్వామికి ఆలయ సరస్వి పుష్కరిణిలో అవబృదస్నానం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు నిత్య కళ్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి జరిపించారు. సదస్యం కార్యక్రమంలో వేద పండితులు వేదస్వస్తి నిర్వహించారు. నాగవల్లి కార్యక్రమంలో పార్వతీదేవికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. ధ్వజావరోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు బుధవారం ముగియనున్నాయి. చివరి రోజు స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు అశ్వ వాహనసేవ, ఆలయ ఉత్సవం, పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం నిర్వహిస్తారు.
హుండీల లెక్కింపు..
శ్రీశైలంలో భక్తులు గత 28 రోజులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీలలో రూ. 3,57,81,068 నగదు, 103 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 520 గ్రాముల వెండి, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ దిర్హమ్‌లు, 20 కెనడా డాలర్లు, 150 యూరోలు, 25 ఇంగ్లాండ్ ఫౌండ్‌లు లభించాయి. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు.
Updated Date - 2023-01-18T03:38:40+05:30 IST