ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువ గళానికి వైసీపీ అడ్డంకులు

ABN, First Publish Date - 2023-07-21T03:01:34+05:30

లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం నాటి సభకు అనేక అడ్డంకులు కల్పించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు.

ఐప్యాక్‌ నేతృత్వంలో రెచ్చగొట్టే పోస్టర్లు

ఒంగోలు, జూలై 20(ఆంధ్రజ్యోతి): లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం నాటి సభకు అనేక అడ్డంకులు కల్పించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. పాదయాత్ర ప్రారంభం కాకముందే కూడలి ప్రాంతాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మతో ఉన్న ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అంతకుముందే అక్కడ యువగళం పాదయాత్ర పోస్టర్లు ఏర్పాటు చేస్తుండగా అధికారుల ద్వారా ఆపించారు. టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేసే పోస్టర్‌ వెలవగా దాన్ని టీడీపీ ఇన్‌చార్జి ఉగ్ర నరసింహారెడ్డి తీసివేయించారు. ఈ పోస్టర్‌ను ఐప్యాక్‌ ప్రతినిధులు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు సభా ప్రాంగణం చుట్టూ షాపుల ముందు ఫ్లెక్సీలు వేయకుండా నిర్వాహకులను రెచ్చగొట్టారు. చంద్రబాబును రాజకీయంగా కించపరిచే వ్యాఖ్యలతో అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు లోకేశ్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు, చించివేత చర్యలకు ఉపక్రమించారు. యువగళం సభకు వస్తున్న ఆటోలు, ఇతర వాహనాలను ఆపి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ జరిమానాలు వేశారు

Updated Date - 2023-07-21T03:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising