ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Srinivasa Rao: బండికి దారి క్లియర్‌!

ABN, First Publish Date - 2023-08-29T03:28:19+05:30

ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావుకు ప్రమోషన్‌ ఇవ్వడం కోసం ఏకంగా జీవోను జారీ చేశారు. ఈ జీవో చూడడానికి ఉద్యోగులందరినీ ఉద్దేశించి ఇచ్చినట్టుగా ఉంది.

గతంలో ప్రమోషన్‌ వద్దనుకున్నా

మళ్లీ ఆ ప్రయోజనానికి అర్హులే

రూల్‌ 28ని సవరిస్తూ ఉత్తర్వులు

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావుకు ప్రమోషన్‌ ఇవ్వడం కోసం ఏకంగా జీవోను జారీ చేశారు. ఈ జీవో చూడడానికి ఉద్యోగులందరినీ ఉద్దేశించి ఇచ్చినట్టుగా ఉంది. కానీ, 1996లో స్టేట్‌ సబార్డినేట్‌ రూల్స్‌ రూపొందిస్తే అప్పటినుంచి రాని ఈ జీవో అవసరం ఇప్పుడే ఎందుకొచ్చిందా అని ఆరాతీస్తే అసలు గుట్టు బయటపడింది. బండికి ప్రమోషన్‌ కల్పించడం కోసమే ఉన్నపళంగా ఆ జీవో ఇచ్చినట్టు తెలిసింది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగి ఒకసారి ప్రమోషన్‌ వద్దనుకుంటే ఇక ఆ వ్యక్తి సర్వీసు మొత్తంలో ప్రమోషన్‌ తీసుకునే హక్కు కోల్పోతాడు. పూర్తిగా తన సర్వీసు కాలం మొత్తం ప్రమోషన్‌ వదులుకోవాల్సిందే. స్టేట్‌ సబార్డినేట్‌ నిబంధనల్లోని రూల్‌ 28 సారాంశం ఇది. కానీ, ఒక ఉద్యోగి ప్రమోషన్‌ వద్దనుకున్నప్పటికీ ప్రమోషన్‌ పోస్టుల్లో వేకేన్సీలు ఉన్నప్పుడు గతంలో దానిని తిరస్కరించిన వ్యక్తికి మళ్లీ పొందే హక్కు కల్పిస్తూ రూల్‌ 28ని సవరిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జీవో ఇచ్చారు. ఒకసారి ప్రమోషన్‌ వద్దనుకుంటే శాశ్వతంగా ప్రమోషన్‌ వదులుకున్నట్టు కాదని ఆ జీవోలో వివరణ ఇచ్చారు. జలవనరుల శాఖలో పనిచేస్తున్న బండి శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం సూపరింటెండెట్‌ కేడర్‌లో ఉన్నారు. ఇది నాన్‌ గజెటెడ్‌ పోస్టు. ఆ సమయంలో ఆయనకు ప్రమోషన్‌ అవకాశం వచ్చింది. ప్రమోషన్‌ తీసుకుంటే గజెటెడ్‌ పోస్టు అయిన ఎన్‌టీపీఏ హోదా వచ్చేది. అయితే, గజెటెడ్‌ పోస్టు తీసుకుంటే ఎన్జీవో సంఘం నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అది ఇష్టం లేక బండి ప్రమోషన్‌ వదులుకున్నారు. ఇప్పుడు నాన్‌ గజెటెడ్‌ అధికారుల సంఘం పేరు, నిబంధనలు మార్చారు. ఆ సంఘానికి ఇటీవలే గజెటెడ్‌, నాన్‌ గజెటెడ్‌ అధికారుల సంఘంగా కూడా పేరు మార్చారు. పైగా, గజెటెడ్‌ అధికారులు కూడా ఆ అసోసియేషన్‌ బాడీలో ఉండొచ్చని ఆదివారమే నిబంధనలు మార్చుతూ ఆ సంఘం తీర్మానం చేసింది. అలా అక్కడ నిబంధనలు సవరించుకున్నారో లేదో ప్రభుత్వం తరపున సీఎస్‌ రూల్‌ నం28ను సవరిస్తూ జీవో ఇవ్వడం గమనార్హం. ఇదంతా బండికి ప్రమోషన్‌ కల్పించడం కోసమేనని ఉద్యోగవర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-08-29T08:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising