ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

ABN, First Publish Date - 2023-04-03T01:32:56+05:30

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తెలంగాణ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టే

పన్నాగాలు మానండి

కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తెలంగాణ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) మండిపడ్డారు. ఈ కుట్రలను అక్కడి కార్మికులు, సంఘాలు, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని ఆరోపించారు. వర్కింగ్‌ కేపిటల్‌, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్‌ ప్లాంట్‌ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాలపాల్జేసి, వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా తమ ప్రైవేట్‌ కార్పొరేట్‌ మిత్రులకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్‌ వోర్‌ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందన్నారు. దీంతో ప్లాంట్‌ తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. తన కార్పొరేట్‌ కంపెనీల మిత్రులకు రూ.12.5 లక్షల కోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీకి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కనికరం ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ నోటిఫికేషన్‌ (ఆసక్తి వ్యక్తీకరణ నోటీసు)ను కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో స్టీల్‌ ప్లాంట్‌ను కలపాలని సూచించారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌కు ఉందని.. ఈ ప్లాంట్‌ తెలుగు ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవడం కోసం తెలుగు వారందరూ కలిసిరావాలని పిలుపిచ్చారు. ప్లాంట్‌ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్‌ సూచించారు.

Updated Date - 2023-04-03T01:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising