వెలిగొండ ప్రాజెక్టును వెంటనేపూర్తి చేయాలి
ABN, First Publish Date - 2023-07-10T01:42:21+05:30
పశ్చిమ ప్రకా శం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేసి, నీళ్ళు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కోరారు.
ఎర్రగొండపాలెం, జూలై 9 : పశ్చిమ ప్రకా శం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేసి, నీళ్ళు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కోరారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సీపీఐ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధి కారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారన్నారు. 2023లో మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలి ఓట్లు అడుగుతానని ప్రజలకు హామి ఇచ్చారన్నారు. ప్రాజెక్టు పరిధిలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఆర్‌ఆర్ ప్యాకేజి నిధులు చెల్లించ లేదని దానిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయక పోతే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో దోర్నాల మండలం నుంచి ఒంగోలు కలెక్టరు ఆఫీసు వరకు పాదయాత్రలు చేస్తామ న్నారు. కలెక్టరు ఎదుట ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమ ప్రాంతంలో వర్షాలు కురవక భూగర్భజలాలు అడుగంటి సాగునీరు, తాగునీరు కరువైందని అయినా ప్రభు త్వం ఈ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడడం లేదన్నారు. సమావేశంలో నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి డి.శ్రీనివాస్, సీపీఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, సహాయ కార్యదర్శి జి.గుర్నాధం, సీపీఐ మండల కార్యదర్శులు బి రామయ్య, విశ్వరూపాచారి, పూర్ణకంటి తిరుమలయ్య, నక్కా తిరుపతయ్య, పాల్గొన్నారు.
Updated Date - 2023-07-10T01:42:21+05:30 IST