ఆక్రమణలు తొలగించేందుకు సమాయత్తం
ABN, First Publish Date - 2023-09-22T02:05:03+05:30
పొదిలిలో ఆక్రమ ణలు తొలగించేందుకు నగర పంచాయతీ అధికారులు సిద్దమయ్యారు.
పొదిలి, సెప్టెంబరు 21 : పొదిలిలో ఆక్రమ ణలు తొలగించేందుకు నగర పంచాయతీ అధికారులు సిద్దమయ్యారు. బుధవారం పొదిలిలో జరిగిన ప్రత్యేక స్పందన కార్యక్ర మంలో కొన్ని వీదుల్లో జరిగన ఆక్రమణలు తొలగించేందుకు కలెక్టర్ దినేష్‌కుమార్‌కు కొంతమంది వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పంచాయతీ కమిషనర్ డానియోల్ జోసఫ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అధికారి మల్లికార్జున్ కార్మికులతో ఆక్రమణలు తొలగించే ప్రదేశానికి వచ్చారు. స్థానిక వెంకటేశ్వర సినిమా హాల్ వీధిలో 40 అడుగుల రహదారికి ఒకవైపు షాపుముందు రేకులు ఏర్పాటు చేసి పూర్తిగా ముందుకు వచ్చారని కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు షాపుల వద్ద ఆక్రమణలు తొలగించేందుకు వచ్చారు. అందుకు యజమా నులు స్పందిస్తూ, తమకు సమాచారం లేకుండా నేరుగా తొలగించేందుకు ఎలా వస్తారని వచ్చిన అధికారిని ప్రశ్నించారు. ఆదివారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. రెండు రోజులు సమయం ఇస్తున్నామని, అప్పటి లోగా ఆక్రమణలు తొలగించాల న్నారు. రహదారులకు ఇరువైపుల ఉన్న శాశ్వత కట్టడాలు కాకుండా ముందు ఏర్పాటు చేసుకున్న కట్టడాలకు ఎలాంటి నోటీసు ఇవ్వనవసరం లేదని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.
చర్చి ప్రహరీగోడ పనులు నిలిపివేత
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రహరిగోడ నిర్మాణం నిలిపి వేసినట్లు నగర పంచాయతీ కమిషనర్ డానియె ల్ జోసఫ్ తెలిపారు. నంద్యాల ఒంగోలు రహదారిలోని పురాతన చర్చికి గతంలోనే ప్రహరిగోడ నిర్మించారు. గతంలో ఉన్న ప్రహరిగోడకు ఉత్తరం వైపున ఉన్న రహదారిలో కొంతభాగంలో ఇప్పుడు గోడను నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు అది చర్చి స్థలం కాదని గోడ నిర్మాణం నిలిపేశారు. అయితే అది చర్చి స్థలమే అని చర్చి పెద్దలు చెబుతున్నారు.
Updated Date - 2023-09-22T02:05:03+05:30 IST