పనులు చేయమంటారు.. బిల్లుల సంగతి పట్టించుకోరు!
ABN, First Publish Date - 2023-08-22T23:50:34+05:30
పనులు చేసి రెండేళ్ల య్యింది. ఇప్పటి వరకూ బిల్లులు రాలేదు. మా ద గ్గర డబ్బులు ఎక్కువై చేశామా? పనులు చేయా లని ఒత్తిడి చేస్తారు. తర్వాత బిల్లుల గురించి ప ట్టించుకోరు’ అని వైసీపీకి చెందిన వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
రెండేళ్ల నుంచి తిరుగుతున్నా చలనం లేదు
ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యం
అధికారులపై వైస్ ఎంపీపీ ఆగ్రహం
పంచాయతీల్లో నిధులు లేకుండా తాగునీటి పథకం ఎలా నిర్వహించాలన్న సర్పంచ్
గరంగరంగా కొండపి మండల సమావేశం
కొండపి, ఆగస్టు 22 : ‘పనులు చేసి రెండేళ్ల య్యింది. ఇప్పటి వరకూ బిల్లులు రాలేదు. మా ద గ్గర డబ్బులు ఎక్కువై చేశామా? పనులు చేయా లని ఒత్తిడి చేస్తారు. తర్వాత బిల్లుల గురించి ప ట్టించుకోరు’ అని వైసీపీకి చెందిన వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికా ర పార్టీకి చెందిన పలువురు సర్పంచ్‌లు కూడా ఆ యనతో జత కలిశారు. పంచాయతీల్లో నిధులు లే కుండా తాగునీటి పథకాలను ఎలా నిర్వహించాల ని ఒకరు ప్రశ్నించారు. మండల సమావేశాల్లో స భ్యులు ప్రస్తావించిన అంశాలపై అధికారులు అస లు స్పందించడం లేదని, అలాంటప్పుడు సమావే శాలు ఎందుకని మరో సర్పంచ్ నిలదీశారు. ఇలా ఎంపీపీ కొండశింగు స్వప్నకుమారి అధ్యక్షతన మం గళవారం జరిగిన కొండపి మండల సర్వసభ్యస మావేశం గరంగరంగా సాగింది. తొలుత వైస్ ఎం పీపీ ప్రసాద్ మాట్లాడుతూ ‘జగనన్న కాలనీకి లె వలింగ్ పనిచేశాను. నాలుగు లక్షల రూపాయలు నిలిచిపోయాయి. చెత్త సంపద కేంద్రం పనిని చే యించారు. రెండు లక్షల రూపాయలు ఆగాయి. జ గనన్న కాలనీలో తాగునీటి వసతికి సంబంఽధించి పని చేయగా సుమారు రూ.4 లక్షల బిల్లు రాలేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రెండే ళ్లుగా బిల్లులు ఇవ్వకుండా తిప్పుతున్నారు. అధికా రులు బదిలీ అయి కొత్తవారు వస్తున్నారు. నా బిల్లులు సంగతి పట్టించుకోవడం లేదు. అదేమంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటారు. రెం డేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు నేనేమి చేయాలి? అ ని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎం పీడీవో రమణమూర్తి కలుగజేసుకొని ఉన్నతాధికా రులతో మాట్లాడతానని సమాదాయించే ప్రయ త్నం చేయగా ‘ఎందుకు ఇటువంటి సమావేశాలు. మా పనులు చేయరు. గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌తో పాడి గేదె చనిపోయింది. యజమానికి ఏదైనా సాయం చేయండని అడిగితే పశుసంవర్థక శాఖ అధికారులు గ్రామంలోకి వచ్చి కనీసం చని పోయిన గేదెను కూడా చూడలేదు. గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేయక, చేసిన ప నులకు బిల్లులు ఇవ్వక ఎందుకు సమావేశం’ అం టూ బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. అం తకు ముందు పెదకండ్లగుంట గ్రామ సర్పంచ్ భు వనగిరి సత్యన్నారాయణ మాట్లాడుతూ అధికారు లు గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించి సమ స్యలపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పకుండా ఏదో ఒకటి చదువుకుంటూ వెళ్తున్నారన్నారు. అంత మాత్రానికి సమావేశం ఎందుకు? అని ప్రశ్నిం చారు. గత సమావేశంలో గ్రామంలో రక్షిత నీటి పథకం వనరు సరిగా లేదని, నీటి పంపిణీ వ్యవస్థ బాగా లేదని అధికారులు దృష్టికి తీసుకొచ్చానన్నా రు. ఓటీఎస్ పథకంలో డబ్బులు కట్టిన వారి ప రిస్థితిపై ప్రశ్నించానన్నారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. మం డల సమావేశం బిస్కెట్లు తిని వెళ్లడానికి, కాల క్షే పానికి జరుపుతున్నారా? అని నిలదీశారు. చినకం డ్లగుంట గ్రామ సర్పంచ్ షేక్ వన్నూరు మాట్లాడు తూ ‘గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు. రక్షిత ప థకం నిర్వహించేందుకు మనుషులను నియమిం చుకోమంటున్నారు. వారికి జీతాలు ఎలా ఇవ్వాలి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకుండా ప్రజల స మస్యలను ఎలా పరిష్కరించాలి’ అని నిలదీశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రసూల్, విద్యుత్ శాఖ ఏఈ కుంచాల కోటయ్య, ఎంఈవో-2 రామారావు, డీటీ సుజాత, ఏవో విజయ్‌కుమార్, హౌసింగ్ అసిస్టెం ట్ నాగరాజు తమశాఖల కార్యకలాపాలను చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణకుమారి, పంచాయతీరాజ్ ఏఈ బి.ప్రసాదరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో మహాలక్ష్మి, వెలుగు ఏపీఎం రాజ్యలక్ష్మి, ఎంఈవో-1 సురేఖ పా ల్గొన్నారు. 12 మంది ఎంపీటీసీలు ఉండగా ఎంపీ పీ స్వప్నకుమారి, వైస్ ఎంపీపీ ప్రసాద్, పెదక ండ్లగుంట, పెట్లూరు ఎంపీటీసీ సభ్యులు బొల్లా సు బ్బారావు, ఆరితోటి కోటిరత్నం కో-ఆప్షన్ సభ్యుడు బాబూరావు సమావేశానికి హాజరయ్యారు.
Updated Date - 2023-08-22T23:50:34+05:30 IST