ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని ముంచేశారు

ABN, First Publish Date - 2023-02-11T00:02:32+05:30

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం(వన్‌టౌన్‌), ఫిబ్రవరి 10: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని పెదనాగులవరంలో శుక్రవారం రాత్రి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, హత్యా రాజకీ యాలు వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకర్ల శ్రీనివాసులు, రామాంజులరెడ్డి పాల్గొన్నారు.

గిద్దలూరు : జగన్‌ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో మండలంలోని సింగంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రా యాలను సేకరించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. అయినా జగన్‌ ప్రభు త్వం చోద్యం చూడడం మినహా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావలసిన అవసరాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటు న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు బాలయ్య, వీరారెడ్డి, మౌలాలి, విజయరాజు, వెంకటరామిరెడ్డి, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-11T00:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising