ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్ట్‌ జీవనాడి

ABN, First Publish Date - 2023-04-14T00:56:53+05:30

పశ్చిమ ప్రాంతానికి వరప్రసాదమైన వెలిగొండ ప్రాజెక్ట్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తర్లుపాడు, ఏప్రిల్‌ 13: పశ్చిమ ప్రాంతానికి వరప్రసాదమైన వెలిగొండ ప్రాజెక్ట్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. వెలిగొండను త్వరితగతిన పూర్తి చేయాలని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కందుల ప్రజా చైతన్య పాదయాత్ర 19వ రోజు గజ్జలకొండ నుంచి ప్రారంభమై పోతలపాడు, కందల్లపల్లి, గానుగపెంట, రాయవరం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు సైతం పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం జగన్‌ వెలిగొండ పూర్తి చేయకుండా పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. బుధవారం మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రజలకు మాయమాటలు చెప్పారన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను అక్టోబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రాజెక్ట్‌కు రూ.3500 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ప్రకటించారన్నారు. నిధులు లేకుండా ఎలా పూర్తి చేస్తారో.. చెప్పకపోవడం పశ్చిమ ప్రాంత వాసులను మరోమారు మోసం చేయడమే అన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలని ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం కూడా మార్కాపురం జిల్లా గురించి నోరు మెదపలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. మార్కాపురాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే రెండు ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు యు.చిన్నపురెడ్డి, జి.రామాంజనేయరెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యాక్షుడు కంచెర్ల కాశయ్య, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కె.కాశిరెడ్డి, టీడీపీ నాయకులు ఉడుముల రామిరెడ్డి, పి.గోపినాథ్‌, గాయం కృష్ణారెడ్డి, గాయం రామిరెడ్డి, సత్తెనపల్లి చలమయ్య, కాశీం, డి.నాసరయ్య, బి.ఎల్లయ్య, కె.బొజ్జయ్య, కె.చెన్నరాయుడు, కె.వెంకటేశ్వర్లు, కె.రమణయ్య, కె.శ్రీనివాసులు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-14T00:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising