రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
ABN, First Publish Date - 2023-03-03T23:31:19+05:30
రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించటంలో పోటీపడుతున్నారు. పట్టుబడ్డా పదేపదే అదే దందా సాగిస్తున్నారు.
పందిళ్లపల్లి వద్ద 160 బస్తాలు పట్టుకున్న అధికారులు
వేటపాలెం పోలీస్ స్టేషన్‌కు లారీ తరలింపు
41 నోటీసులతో సరిపెడుతున్నారనే ఆరోపణలు
చీరాల, మార్చి 3: రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించటంలో పోటీపడుతున్నారు. పట్టుబడ్డా పదేపదే అదే దందా సాగిస్తున్నారు. నిందితులపై నమోదైన కేసులో పోలీసులు వారి నుంచి పైసలు తీసుకుని 41 నోటీసులు ఇచ్చి పంపటంతో ఆ దందాను ఎవరు వీడటం లేదని ప్రజ లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు వరుసగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడిన వారికి 41 నోటీసులు నుంచి స్టేషన్ నుం చి పంపటం అందుకు నిదర్శనమంటున్నారు. 6ఏతో పాటు నిత్యావసర సరుకుల చట్టం కింది క్రిమినల్ కేసు అనేది కూడా నామమాత్రం కావటం కూడా మ రో కారణం. దీంతో ఒకప్పుడు త్రిమూర్తులుగా అక్రమ రేషన్ దందాలో చక్రం తిప్పిన వ్యక్తుల్లో ఓ వ్యక్తి మరలా ఈ దందాలో రంగప్రదేశం చేశాడు. పాతగోతాల ముసుగులో పాత చీరాలకు చెందిన నాగూర్ అనే వ్యక్తి పోలీసులకు సవాల్‌గా మారాడు. నాలుగు రోజుల క్రితం రూరల్ సీఐకి పట్టుబడ్డ రేషన్ బియ్యం వాహనం, అంతకు ముందు నెలలో పట్టుబడ్డ నిందితులకు 41 నోటీసులు ఇచ్చిపంపారు. అంతకుముందు కూడా చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదే తంతు జరుగుతోంది. తాజాగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున డీఎస్‌వో విలియమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో మినీలో లారీలో తరలిస్తున్న 160 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వాహనాన్ని, నిందితులను వేటపాలెం పోలీ్‌సస్టేషన్‌కు అప్పగించారు.
తాజాగా శుక్రవారం తెల్లవారుజామున పట్టుబడ్డ 160 బస్తాల రేషన్ బియ్యం (50 కేజీలు బస్తాలు) కూడా సివిల్ సప్లయీస్ ముద్రలున్న గోతాలతో ఉం డటం విశేషం. వారి బరితెగింపు ఇది నిదర్శనం. డీఎ్‌సవో విలియమ్స్ బృందం నిర్వహించిన ఈ దాడులలో మిలీ లారీ డ్రైవర్ అవినాష్ మాత్రమే పట్టుబడ్డాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం సుంకర వెంకట్రావు అలియాస్ మోటుపల్లి వెంకట్రావు, లక్ష్మీనారాయణ, నాగరాజు అనే ముగ్గురు వ్యక్తులు తనకు రేషన్ బియ్యం లోడ్ చేయించారని డీఎ్‌సవోకు తెలిపారు. దీంతో ఆ ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని డీఎ్‌సవో తెలిపారు. పట్టుబడ్డ వాహనాన్ని, బియ్యంను వేటపాలెం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వాహనాన్ని సీజ్‌చేసి పట్టుబడ్డ బియ్యం బస్తాలను రైస్‌మిల్లుకు తరలించనున్నట్లు తెలిపారు. ఈ దాడులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం ఎస్సై సురేష్ కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చే స్తున్నారు.
Updated Date - 2023-03-03T23:31:19+05:30 IST