ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రుడు..!

ABN, First Publish Date - 2023-09-22T23:08:31+05:30

తెలుగుదేశం పాలనలో గిరిజనులకు సముచిత స్థానం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును వ్యతిరేకిస్తూ కనిగిరిలో గత 10రోజులుగా వివిధ వర్గాల వారు తమ మద్దతును తెలుపుతూ నినదిస్తున్నారు.

బాబుతోనే నేనూ అంటూ సంతకం చేస్తున్న గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి

కనిగిరి, సెప్టెంబరు 22: తెలుగుదేశం పాలనలో గిరిజనులకు సముచిత స్థానం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును వ్యతిరేకిస్తూ కనిగిరిలో గత 10రోజులుగా వివిధ వర్గాల వారు తమ మద్దతును తెలుపుతూ నినదిస్తున్నారు. వినూత్న రీతిలో తమ నిరసనను తెలియచేస్తూ మేము సైతం చంద్రబాబుతో అంటూ నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం టీడీపీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో 10రోజు దీక్షల్లో గిరిజన కుటుంబాలు చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా పాల్గొన్న డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించి ఇబ్బంది పెడుతున్న ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కుట్రపూరితంగా జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీక్షల్లో గిరిజనులు వినూత్న నిరసన

గిరిజనులు తమ తమ కులవృత్తుల పనిముట్లను ఉంచి వినూత్న నిరసనను తెలియచేశారు. వృద్ధులు, చిన్నారులు చంద్రబాబుతోనే మేమూ అంటూ సంతకాలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామన్నారు. ఎస్టీ కుటుంబానికి చెందిన ఓ మహిళ చంద్రబాబు అక్రమ అరెస్టు పట్ల కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబాలు కడుపునిండా భోజనం చేస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ తమకు ఇచ్చిన సంక్షేమ పఽథకాల వలనే సాధ్యమౌతుందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేయటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీలు జయంపు గోపాల్‌, రాపూరి నారాయణ, శ్రీరాం భాస్కర్‌, రాపూరి శ్రీను, రాపూరి బాలకృష్ణ, మేకల లక్ష్మీదేవి, మేకల మాల్యాద్రి, కొమరగిరి రవి, ప్రసాద్‌, జయంపు సాలమ్మ, చలంచర్ల నిర్మల, లక్ష్మీదేవి, ఏసమ్మ, వేటగిరి అంకమ్మ, రాపూరి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising