యాప్ మాయ..!
ABN, First Publish Date - 2023-10-12T23:59:18+05:30
కనిగిరిలో కొత్తరకం యాప్ మోసం చోటుచేసుకుంది. ఈ వ్యాపారంలో కొందరు ఏజెంట్లుగా మారి నగదును పెట్టి మోసపోయినట్లు చర్చ సాగుతోంది. ఈ దందాలో వలంటీర్లను వ్యాపారంలోకి దించి చైన్ బిజినె్‌సగా ఓ ప్రైవేటు కంపెనీ మోసానికి పాల్పడిందని ప్రచారం ఉంది. గ
కనిగిరిలో ఆన్‌లైన్ చైన్ లింక్ వ్యాపారం
పెద్ద ఎత్తున మోసపోయిన ప్రజలు
లబోదిబోమంటున్న పింఛన్‌దారులు
ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు, అమ్మకాలు
వారానికి రెండింతల ఆదాయయమంటూ ఏజెంట్ల ప్రచారం
దందాలో వలంటీర్లు, వైసీపీ నేతలు
కనిగిరి, అక్టోబరు 12 : కనిగిరిలో కొత్తరకం యాప్ మోసం చోటుచేసుకుంది. ఈ వ్యాపారంలో కొందరు ఏజెంట్లుగా మారి నగదును పెట్టి మోసపోయినట్లు చర్చ సాగుతోంది. ఈ దందాలో వలంటీర్లను వ్యాపారంలోకి దించి చైన్ బిజినె్‌సగా ఓ ప్రైవేటు కంపెనీ మోసానికి పాల్పడిందని ప్రచారం ఉంది. గతంలో కూడా కనిగిరిలో జామాయిల్ తోటల వ్యాపారం అంటూ ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చెప్పడంతో ఆన్‌లైన్‌లో కోట్లు పెట్టుబడి పెట్టి చాలామంది మోసపోయారు. తాజాగా ఈ యాప్ వ్యాపారంలోనూ ఎంతోమంది చేరి నష్టపోయినట్లు సమాచారం. పట్టణానికి చెందిన 20వ వార్డు సచివాలయ వలంటీర్ సుల్తాన్(ఈడబ్ల్యూటీ) యాప్ ద్వారా రూ.98వేలు నష్టపోయినట్లు పీఎ్‌సలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. రాజకీయ ఒత్తిడితో ఆయన కేసు పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది.
దందాలో వలంటీర్లు, వైసీపీ నేతలు
ఈ దందాలో చాలామంది వలంటీర్లు అధికారపార్టీ నాయకులు, ముఖ్యనేత అనుచరులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే ఈ మోసాన్ని బయటకు రానివ్వకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు లేకుండా చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. 150 మంది వరకూ వలంటీర్లు ఈ యాప్ చైన్‌లింక్‌లో చేరడంతోపాటు వారు వందలాది మందిని చేర్పించినట్లు తెలిసింది. ప్రధానంగా ప్రతినెలా పింఛన్‌లు ఇచ్చే క్రమంలో పలువురు వృద్ధులను కూడా ఈ యాప్ బిజినె్‌సలో చేర్పించారు. రూ.1000 కట్టి చేరితే రెట్టింపు లాభం పొందవచ్చని ఆశచూపించడంతో కట్టిన వారంతా నిండా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా సిబ్బంది, స్వీపర్లు కూడా యాప్‌లో చేరి మోసపోయినట్లు చర్చ సాగుతోంది. ఈ యాప్‌లో చేరాలనుకునేవారు రూ.1000 కట్టడంతోపాటు ముగ్గురిని చేర్పించినట్లయితే 15రోజులలో రూ.5,400చొప్పున ఖాతాకు జమ అవుతుంటుంది. అలా ఎంతమందిని చేర్పిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంటందనేది యాప్ మాయ. గత నాలుగు నెలలుగా సాగిన ఈ యాప్ వ్యాపారంలో రూ.2కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు ఈ ఆన్‌లైన్ యాప్ వ్యాపారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులను ఆదుకోవాల్సి ఉంది. కల్లబొల్లి మాటలు చెప్పి ఈ వ్యాపారంలోకి అమాయకులను దింపి మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మెసేజ్‌లతో మోసపోయా:
-బాధితుడు సుల్తాన్
టెలిగ్రామ్ యాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ అంటూ ఇంటి వద్దనే ఉండి ఈడబ్ల్యూటీ కంపెనీ యాప్ ద్వారా పెట్టుబ డి పెట్టి ఒకటికి రెండింతలు లాభాలు పొందవచ్చనే లొరే నా పాటిల్(9046925360) అనే నెంబర్ నుంచి కాల్, మెసేజ్ వచ్చింది. ఆ యాప్‌లో పెట్టుబడి పెడుతూ వచ్చా. మొదటి పెట్టుబడికి వారానికి రెండింతలు ఆదాయం వచ్చినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని స్నేహితులతో ప్రస్తావించడంతో వారూ చేరారు. నాకు వచ్చిన డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతున్నా నిర్వాహకులు ఎవరూ స్పందించ లేదు. మోసపోయినట్లు తెలుసుకున్నా.
Updated Date - 2023-10-12T23:59:18+05:30 IST