ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి ముందే దాహం కేకలు

ABN, First Publish Date - 2023-01-18T00:25:15+05:30

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. దీంతో నిత్యం 579 ట్యాంకర్ల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటిని సరఫరా చేస్తు న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగొండపాలెం, జనవరి 17: నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. దీంతో నిత్యం 579 ట్యాంకర్ల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటిని సరఫరా చేస్తు న్నారు. రానురాను తాగునీటికి మరింత కటకట ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి సమస్య పెరుగుతుందని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు మండలాలకు సాగర్‌జలాలు సరఫరా చేసేందుకు శాశ్వత రక్షిత తాగునీటి పథకాలున్నాయి. అయితే అవి సక్రమంగా పనిచేయడం లేదు. ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో నాలుగు మండలాల్లో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లు పైనే ఆధారపడక తప్పడం లేదు. త్రిపురాంతకం మండలం దువ్వలి, లేళ్లపల్లి, మిట్టపాలెం, రామసముద్రం, చెర్లోపల్లి, కేశినేనిపల్లి, గ్రామాల్లో తాగునీటి కోసం ట్యాంకర్లు పైనే ఆధారపడుతున్నారు. పెద్దారవీడు మండలంలో 15 గ్రామాలకు 221 ట్యాంకర్లు, పుల్లలచెరువు మండలంలో 15 గ్రామాలకు 114 ట్యాంకర్లు, త్రిపురాంతకం మండలంలో 4 గ్రామాలకు 86 ట్యాంకర్లు, ఎర్రగొండపాలెం మండలంలో 12 గ్రామాలకు 158 ట్యాంకర్ల ద్వారా నీటిని ట్యాంకరులతో సరఫరా చేస్తున్నారు. ఈ సంవత్సరం పొడవునా వర్షాకాలంలో కూడా తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేసిన టాక్టరు యజమానులకు రెండున్నర సంవత్సర బిల్లులు చెల్ల్లింపు పెండింగ్‌లో ఉన్నా యి. దీంతో కొన్ని గ్రామాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసేందుకు టాక్టర్ల యజమానులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో శాశ్వత తాగునీటి పథకాలు పుల్లలచెరువు మండలంలో ముటుకుల తాగునీటి పథకం, త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామం లో ఉన్నాయి. రక్షిత తాగునీటి పథకాల పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో వాటి ద్వారా సక్ర మంగా సరఫరా జరగడం లేదు.ఆ పైపులైన్లు సరిచేస్తే పుల్లలచెరువు, పెద్దారవీడు మండలాలల్లోని గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజ లు కోరుతున్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వివరణ

గ్రామాల్లో తాగునీటి సమస్య పెరుగుతోంది. నివారణకు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తాం.

Updated Date - 2023-01-18T00:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising