ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ABN, First Publish Date - 2023-08-24T23:20:27+05:30

కనిగిరి ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆయన ఆధ్వర్యంలో ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్‌, జననీ చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో గురువారం మెగా జాబ్‌మేళాను నిర్వహించారు.

జాబ్‌మేళాకు హాజరైన కనిగిరి ప్రాంత నిరుద్యోగ యువత .. వారినుద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

కనిగిరి, ఆగస్టు 24 : కనిగిరి ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆయన ఆధ్వర్యంలో ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్‌, జననీ చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో గురువారం మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గా పాల్గొన్న డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ జాబ్‌ మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో రావడం చూస్తుంటే కనిగిరి ప్రాం తంలో చాలా మంది ఉన్నత చదువులు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ ప్రాం తంలో నిమ్జ్‌ ఏర్పాటుతోనే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కానీ ఆదిశగా చర్యలు తీసుకోవడంలో వైసీపీ పాలకులు విఫలమయ్యారన్నారు. తాను వేరే ప్రాంతాలకు వెళ్లినపుడు చాలా మంది మన ప్రాంత వాసులు తారసపడి ఈ ప్రాంతం గురించి చెప్తుంటే ఉపాధి కోసం వలసలు వెళ్లినందుకు బాధపడాలా, మనప్రాంతం వారు అన్ని ప్రాం తాల్లో ఉన్నారని గర్వపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంటుందన్నారు. ఆ సమయంలోనే కనిగిరి ప్రాంత యువత కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనలోంచి పుట్టినదే ఈ ప్రయత్నం అన్నారు. రాజకీయంగా పదవుల్లో ఉన్నప్పుడే మనప్రాంత అభివృద్ధికి అవకాశాలు కల్పించుకోగమన్నారు. పాలకుడు స్థానికుడైతేనే ప్రజలకు మేలుజరుగుతుందన్నారు. నిరుద్యోగుల కు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే త లంపుతోనే తనకున్న పరిచయాల ద్వారా వివిధ సాఫ్ట్‌వేర్‌, ప్రైవేటు కంపెనీలతో మా ట్లాడి ఉద్యోగాలకు ఇంటర్‌వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉగ్ర తెలిపారు. తనపైన అభిమానంతో ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు ఉగ్ర కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి వారి వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పు డు ఉద్యోగం రానివారు బాధపడాల్సిన అవసరం లేదని, మరోసారి అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కుమందికి ఉద్యోగాలు క ల్పించడమే తన లక్ష్యమని ఉగ్ర తెలిపారు. కా ర్యక్రమంలో టీడీపీ నాయకులు జంషీర్‌ అహ్మద్‌, మూలె బ్రహ్మారెడ్డి, నారపరెడ్డి(యడవల్లి), శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

126 మందికి ఉద్యోగాలు

డాక్టర్‌ ఉగ్ర ఆధ్వర్యంలో నిర్వహించిన మె గా జాబ్‌మేళాలో శ్రీ సిటీకి చెందిన 27 కంపెనీలు కనిగిరి ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు వారివారి విద్యార్హతను బట్టి ఇంటర్వ్యూ లు నిర్వహించారు. అందులో భాగంగా దాదా పు 143 మందికి పైగా ఇంటర్వ్లూలో పాల్గొనగా, వారిలో 126 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. బీటెక్‌, ఇంజనీరింగ్‌ వంటి విద్యార్హతలు ఉన్న వారికి ఉపాధి అవకాశాలు ద క్కాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎస్‌వీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-24T23:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising