ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

ABN, First Publish Date - 2023-01-29T01:36:21+05:30

డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని స్థానిక అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.మేరీసారాదానమ్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, జనవరి 28 : డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని స్థానిక అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.మేరీసారాదానమ్మ అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో శనివారం మానవ అక్రమ రవాణా నిరోధక కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. 46శాతం మహిళలు, 19 శాతం అమ్మాయిలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు, నిరక్ష్యరాస్యతే ప్రధాన కారణమన్నారు. సినిమాల ఆశ, అధిక జీతాలకు ఎందరో బాలలు, మహిళలు ఆకర్షణకు లోనై అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. బాలలు అక్రమ రవాణాకు గురైతే చైల్డ్‌లైన్‌ 1098, మహిళలు అక్రమ రవాణాకు గురైతే 100కు తెలియజేయాలన్నారు. అనంతరం కరపత్రాలను జడ్జీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పిచ్చయ్య, సిద్ధయ్య, ప్రకాశ్‌, లవకుమార్‌, మెప్మా సిటీమిషన్‌ మేనేజర్‌ ప్రసాద్‌, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు రమణమ్మ, రిసోర్స్‌పర్సన్స్‌ పాల్గొన్నారు.

సబ్‌ జైలు తనిఖీ

పట్టణంలోని సబ్‌జైలును శనివారం అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.మేరీసారాదానమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడారు. ఆహార వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ లింగారెడ్డి, పారాలీగల్‌ వలంటీర్‌ మధుసూదన్‌రావు, ఏలియా, అన్నోజీరావు, డానియేలు, యోబు, గురువయ్య, రాజశేఖర్‌, నరసింహారావు, కోర్టు సిబ్బంది కాశీ, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T01:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising