ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాయింట్‌ కలెక్టర్‌గా శ్రీనివాసులు

ABN, First Publish Date - 2023-04-09T00:38:48+05:30

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కె.శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గ్రూపు-1 శిక్షణ పొందింది ఇక్కడే!

రెండు రోజుల్లోనే ఉత్తర్వుల మార్పు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 8 : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కె.శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గురువారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేయగా ఇక్కడ జేసీగా పనిచేస్తున్న అభిషిక్త్‌ కిషోర్‌ను బదిలీ చేసి చామకూరి శ్రీధర్‌ను నియమిమించారు. అయితే శనివారం ఆ ఉత్తర్వులను సవరించి బాపట్ల జేసీగా పనిచేస్తున్న శ్రీనివాసులును ప్రకాశం జేసీగా నియమించారు. అలాగే శ్రీధర్‌ను బాపట్ల జిల్లా జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

పక్కజిల్లా వాసి.. సుపరిచితుడు

నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురానికి చెందిన కె.శ్రీనివాసులు 2007-08లో ప్రకాశం జిల్లాలో గ్రూపు-1 శిక్షణ పొందారు. 2008 నుంచి 2011 వరకు నర్సరావుపేట ఆర్డీవోగా, 2011-12 వరకు రాజంపేట ఆర్డీవోగా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు ఖమ్మంలో డ్వామా పీడీగా పనిచేశారు. 2014-15లో పులిచింతల ప్రాజెక్టులో పనిచేయగా, 2015 నుంచి 19 వరకు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల డీఆర్‌డీఏ పీడీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన 2019 నుంచి 2022 వరకు శ్రీకాకుళం జేసీగా పనిచేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2022 నుంచి బాపట్ల జేసీగా పనిచేస్తున్నారు. నిబద్ధత గల అధికారిగా పేరుంది.

Updated Date - 2023-04-09T00:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising