టీడీపీతోనే సామాజిక న్యాయం
ABN, First Publish Date - 2023-10-26T23:42:19+05:30
టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ఎంఎస్ రాజు తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్‌యాత్ర గురువారం మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి పట్టణంలోకి ప్రవేశించింది. వీరికి స్థానిక ఎస్సీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు
పొదిలి, అక్టోబరు 26 : టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ఎంఎస్ రాజు తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్‌యాత్ర గురువారం మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి పట్టణంలోకి ప్రవేశించింది. వీరికి స్థానిక ఎస్సీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మార్కాపురం అడ్డరోడ్డు నుంచి చినబస్టాండ్ సాయిబాలాజీ కల్యాణ మండపం మీదగా సాగిన యాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం గారడితో పాలన సాగిస్తోందన్నారు. అభివృద్ధి కంటే దాడులు, కేసులు, అత్యాచారాలే ఎక్కువని విమర్శించారు. ఎస్సీ, ముస్లీం, బీసీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. వరుస అఘాయిత్యాలపై సంబంధిత మంత్రిత్వశాఖలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిని మరిచిన మంత్రులు ప్రజలకు ముఖం చూపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సామాజిక సాధికారత బస్సుయాత్ర పేరుతో వస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అన్యాయం జరిగిన ప్రతిచోట బీసీ, ఎస్సీలతోపాటు ప్రజలు మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఎదురుగా ఢీకొట్టలేకే...
45ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుని అక్రమంగా నిర్బంధించారని రాజు చెప్పారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేసిన చంద్రబాబును ఎదురుగా ఢీకొట్టలేక అడ్డదారిలో అరెస్ట్ చేయించి శునకానందం పొందుతున్నారని విమర్శించారు. నిజం నిదానంగా తేలుతుందని రారాజులా ఆయన బయటకు వచ్చి 2024లో అఖండ మెజారిటీతో గెలిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన కలయికను ప్రజలు స్వాగతించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, ముల్లా ఖుద్దూస్, టీఎన్‌ఎస్‌ఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, జిల్లా ముస్లీం మైనారిటీ అధ్యక్షులు రసూల్ మహమ్మద్, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి నారాయణబాబు, మాజీ సర్పంచ్ కాటేరి చినబాబు, కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షుడు బాబురావు, గొట్లగట్టు సర్పంచ్ సుఖదేవ్, మండల ఎస్సీసెల్ నాయకులు ఠాగూర్, జ్యోతిమల్లికార్జున్, జిల్లా ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి యాసిన్, నాయకులు ముని శ్రీనివాసులు, కాటూరి శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2023-10-26T23:42:19+05:30 IST