ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్‌ఎన్‌పాడు తహసీల్దార్‌ కార్యాలయ ప్రక్షాళన

ABN, First Publish Date - 2023-09-22T23:36:59+05:30

: సంతనూతలపాడు మండల త హసీల్దార్‌ కా ర్యాలయ ప్ర క్షాళన మొదలైంది. అక్క డ పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీలు చేస్తూ కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మూడు రోజుల క్రితం సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యురాలి భర్త అయిన దుంపా చెంచిరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

భారీగా ఉద్యోగుల బదిలీలు

తహసీల్దార్‌పై ఘటన నేపథ్యంలో నలుగురిపై వేటు

అటెండర్లను కూడా బదిలీ చేసే విధంగా కలెక్టర్‌ ఆదేశాలు

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 22 : సంతనూతలపాడు మండల త హసీల్దార్‌ కా ర్యాలయ ప్ర క్షాళన మొదలైంది. అక్క డ పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీలు చేస్తూ కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మూడు రోజుల క్రితం సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యురాలి భర్త అయిన దుంపా చెంచిరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ తహసీల్దార్‌ నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్ల వరకు వైసీపీ నేత కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్లు తేలిం ది. దీంతో కలెక్టర్‌ నలుగురిని బదిలీ చేయగా, అటెండర్లను బదిలీలు చేసే విధంగా ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావును ఆదేశించినట్లు తెలిపారు. ఒకవైపు తహసీల్దార్‌పై దాడి ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుండగా మరోవైపు రెవెన్యూ పరంగా ఎస్‌ఎన్‌పాడులో జరుగుతున్న పరిణామాలపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనేక ఆరోణలు ఎదుర్కొన్న మండల రెవెన్యూఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయగా, మరో నలుగురు ఉద్యోగులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్‌ఎన్‌పాడు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఒంగోలులోని కలెక్టరేట్‌కు బదిలీ చేయగా, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న శాంతిని ఎస్‌ఎన్‌పాడు డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎస్‌కే సుష్మను జరుగుమల్లికి బదిలీ చేయగా, సీనియర్‌ అసిస్టెంట్‌ బి.శ్రీనివాసరావును టంగుటూరుకు, జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.ఉపేంద్ర యాదవ్‌ను తాళ్లూరుకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. జరుగుమల్లిలో పనిచేస్తున్న బి.రాజ్యలక్ష్మీని ఎస్‌ఎన్‌పాడు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా, టంగుటూరులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పీవీ రమణయ్య, తాళ్లూరులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంవీఎస్‌ సుధీర్‌కుమార్‌ను ఎస్‌ఎన్‌పాడుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచూశారు. తహసీల్దార్‌ కార్యాలయం కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఐ.నాగేశ్వరరావును నియమించారు.

తహసీల్దార్‌పై దాడి కేసును విచారించిన డీఎస్పీ

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 22 : సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ నేత దుంపా చెంచిరెడ్డి దాడి చేసిన కేసును ఒంగోలు డీఎస్పీ నారాయణరెడ్డి స్వయంగా విచారించారు. శుక్రవారం ఇరువర్గాలను పిలిచి విచారించారు. తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తదితరులు డీఎస్పీని కలిసి తమకు న్యాయం చేయమని కోరారు. అనంతరం వైసీపీ నాయకుడు దుంపా చెంచిరెడ్డిని కూడా విచారించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన పనులు సకాలంలో చేయడం లేదని, అలా జాప్యం లేకుండా చూడాలని తహసీల్దార్‌తో చెప్పానని, ఎలాంటి దాడి చేయలేదని, దౌర్జన్యంగా కూడా వ్యవహరించలేదని చెంచిరెడ్డి తెలిపారు. కాగా ఇంకా కేసు విచారణలో ఉందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-09-22T23:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising