ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్షతగాత్రుల వైద్య ఖర్చులను ఆర్టీసీ భరిస్తుంది

ABN, First Publish Date - 2023-07-13T01:53:16+05:30

బస్సు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వైద్య ఖర్చులను ఆర్టీసీ భరిస్తుందని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ఆర్టీసీ ఎండీ తిరుమలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు

సంఘటనా స్థలం పరిశీలన

బాధితులకు పరామర్శ

దర్శి/ఒంగోలు(క్రైం)/పొదిలి, జూలై 12 : బస్సు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వైద్య ఖర్చులను ఆర్టీసీ భరిస్తుందని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దర్శి పట్టణ సమీపంలో సాగర్‌ కాలువలో ఆర్టీసీ బస్సు పడిన ప్రదేశాన్ని ఆయన బుధవారం ఉదయం పరిశీలించారు. సంఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందటం, అనేక మంది గాయాలపాలవ్వడం బాధాకరమన్నారు. ఘటన జరగటానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌వర్థన్‌రెడ్డి, సీఐ రామకోటయ్య, ఎస్సై రామకృష్ణ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

క్షతగాత్రులకు పరామర్శ

బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్న పొదిలికి చెందిన షేక్‌ యసదన్‌, మూళ్ళ షబ్బీర్‌, షేక్‌ సలిమున్నీషాలను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎస్పీ మలికగర్గ్‌లు బుధవారం పరామర్శించారు. ప్రమాదం జరి గిన తీరును వారిని అడిగి తిరుమలరావు తె లుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్ట ర్లతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్టీసీఈడీ శ్రీకృష్ణకాంత్‌, అధికారులు ఆదాం సాహెబ్‌, ఎస్బీ డీఎస్పీ మరియదాసు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్టీసీ రూ.5లక్షల పరిహారం

బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఆర్టీసీ నుంచి రూ.5లక్షల పరిహారం అందజేస్తామని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. బుధవారం ఆయన పొదిలి ఎన్జీవో కాలనీకి వచ్చారు. దర్శి సమీపంలోని సాగర్‌ కాలువలో బస్సు బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం, ఇతరశాఖల సమన్వయలోపంతోపాటు కాంక్రీట్‌ దిమ్మెను గుర్తించడంలో తమ సిబ్బంది విఫలమయ్యారని ఎండీ పేర్కొ న్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చెట్లను ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించి స్టిక్కర్లు వేశారన్నారు.

Updated Date - 2023-07-13T01:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising