ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా
ABN, First Publish Date - 2023-06-26T00:35:15+05:30
హైదరాబాద్ నుంచి మార్కాపురానికి ప్రయాణికులతో వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆదివారం బోల్తా పడింది.
పుల్లలచెరువు,జూన్ 25: హైదరాబాద్ నుంచి మార్కాపురానికి ప్రయాణికులతో వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆదివారం బోల్తా పడింది. అందిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణి కులతో హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తోంది. మధ్యహ్నం సూమారు 3 గంటల సమయంలో మురికిమల్లపెంట సమీపం లోని మూలమలుపు వద్ద రోడ్డు అంచులోకి దిగింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో సూమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సురోడ్డుకు అడ్డుగా పడటంతో మాచర్ల- ఎర్రొండపాలెం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇరు వైపులా సూమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్‌ఐ శ్రీహరి, నేషనల్ హేవే సిబ్బంది ఎక్స్‌కవేటర్లతో బస్సును పక్కకు తీయించారు.
Updated Date - 2023-06-26T00:35:15+05:30 IST