ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్ల రోత..!

ABN, First Publish Date - 2023-09-06T22:32:49+05:30

హైవే, ప్రధాన, గ్రామీణ రోడ్లు రోత పుట్టిస్తున్నాయి. అడుగుకో గుంతతో అధ్వానంగా మారాయి. కనీసం నడిచివెళ్లుందుకు కూడా వీలులేని పరిస్థితికి చేరాయి. ఇక ద్విచక్రవాహనదారులు, పెద్ద వాహనాలపై రాకపోకలు చేసేవారికి నరకం చూపిస్తున్నాయి. రోజూ పలు రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంతలమయమైన రాజంపల్లి - బొద్దికూరపాడు

అధ్వానంగా ఆర్‌అండ్‌బీ దారులు

అడుగుకో గుంత

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు

చోద్యంచూస్తున్న వైసీపీ పాలకులు

పట్టించుకోని అధికారులు

కనిగిరి, సెప్టెంబరు 6 : హైవే, ప్రధాన, గ్రామీణ రోడ్లు రోత పుట్టిస్తున్నాయి. అడుగుకో గుంతతో అధ్వానంగా మారాయి. కనీసం నడిచివెళ్లుందుకు కూడా వీలులేని పరిస్థితికి చేరాయి. ఇక ద్విచక్రవాహనదారులు, పెద్ద వాహనాలపై రాకపోకలు చేసేవారికి నరకం చూపిస్తున్నాయి. రోజూ పలు రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనిగిరి నియోజకవర్గంలో తారు రోడ్లు ఆధ్వానంగా మారి, వాహనాలు తిరగటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యానికి ఇవి అద్దం పడుతున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చుచేసి వే సిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతున్నాయి. పాతరోడ్డుపై వేసిన కంకరు, తారు లేచి అక్కడక్కడా తిరిగి పాతరోడ్డు కనిపిస్తుంది. తారురోడ్డుపై వేసిన కంకరు, రాళ్లు లేచి గుట్టలు గుట్టలుగా ఉండడంతో ద్విచక్రవాహనాలు తిరగడానికి ఇబ్బందిగా మారింది. తారురోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండడంతో వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి తారురోడ్లు మరింతగా దెబ్బతింటున్నాయి.

రోడ్లపై గుంతలు.. లేచిన కంకర

తారు రోడ్లపై తారు లేచి, కంకరు రోడ్లపై కంకరు లేచి రోడ్లన్నీ గుంతలు పడడంతో ప్రమాదాలతో పాటు వాహనాలు మర్మతులకు గురవుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మోటారుసైకిళ్లకు పంక్చర్‌లు పడుతున్నాయని చెప్తున్నారు. కనిగిరి - కంభం వెళ్లే రోడ్డులో కనిగిరి చెక్‌పోస్టు నుంచి శ్రీరంగాపురం వరకు అక్కడక్కడు గుంతలు పడ్డాయి. శ్రీరంగాపురం నుంచి హనుమంతునిపాడు వరకు రోడ్డుపైన తారు లేచిపోయి పాతరోడ్డు బయట పడడంతో పాటు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. కనిగిరి- పామూరు 565 హైవే రోడ్డులో చాలా చోట్ల తారు అట్టలు అట్టలుగా లేచి కో సుకుపోయి వాహనాలకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఈ మా ర్గంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. సీఎ్‌సపు రం మండలంలోని డీజీపేట నుంచి కోనపల్లి వెళ్లే మార్గంలో వెంకటాయచెరు వు వద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. పీసీపల్లి మండలం తలకొండపాడు నుంచి విజయగోపాలపురం వెళ్లే రోడ్డంతా గుంతలు పడి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా నియోజకవర్గంలోని పామూరు, వెలిగండ్ల మండలాల్లోని చాలా తారు రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోవటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

దర్శి : దర్శి ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మా రాయి. తారులేచిపోయి గుంటలమయం కావటంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంటలలో నీరు చేరటంతో మరింత ఇబ్బందికరంగా మారింది. దర్శి - ఆరవళ్లిపాడు రోడ్డులో బం డివెలిగండ్ల వద్ద రెండు అడుగల లోతులో నీరు నిల్వ ఉంది. వర్షం నీరు మొ త్తం రోడ్డుపైకి చేరడంతో నీటి కుంటలా మారిపోయింది. అనేక చోట్ల రోడ్లు గుంతలు పడి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాజంపల్లి-బొద్దికూరపాడు రోడ్డు తారుచేచిపోయి గుంటలు పడటంతో పాటు మార్జిన్లు కూ డా కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దర్శి-దొనకొండ రోడ్డు అనేక చోట్ల గుంతలు పడి దారుణంగా మారింది. మార్జిన్లల్లో గుంతలు పడడంతో ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించే వీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మరమ్మతులను పట్టించుకోవడం లేదు. పాలకులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శి-ఆరవళ్లిపాడు రోడ్డుపై వర్షం పడినప్పుడల్లా రెండేళ్లుగా నీరు నిలిచి నెలల తరబడి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న అధికారులు చర్యలు తీసుకోలేదు. కాల్వలు నిర్మించి నీరు బయటకు పంపే ప్రయత్నం చేయకపోవడంతో రోడ్లుపైనే నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఊరు దాటేదెలా..?

దొనకొండ : మండలంలోని చందవరం గ్రామం గుండా శ్రీశైలం, త్రిపురాంతకం వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారికి నాలుగేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. వర్షం కురిస్తే చందవరం గ్రామంలో రోడ్డు నీటికుంటలా మారుతుండడంతో ఊరు దాటే దారేది అంటూ గ్రామస్తులు ఆవేధనలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ రోడ్డు ఇంతే పాలకులు పట్టించుకోరు, అధికారులు స్పందించరూ అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందవరం గ్రామంలో ప్రతినిత్యం రాకపోకలు జరుపుకునే గ్రామంలోని ప్రధాన రహదారి వర్షం కురిస్తే నీటి కుంటలా మారి తిరిగి వర్షం నీరు ఇంకిపోయేవరకు తమ ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. నాలుగేళ్లుగా పాలకుల వద్ద తమ గోడును ఎన్నోసార్లు వెల్లబుచ్చుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని వర్షం కురిస్తే వర్షపునీళ్లు రహదారి మొత్తం నిలవడంతో అటు ఇటు వెళ్లేందుకు, వాహన చోదకులు, పాదచారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని తెలుపుతున్నారు. ఈ రహదారి గుండా పుణ్యక్షేత్రాలైన శ్రీశైౖలం, త్రిపురాంతకంతో పాటు చందవరం సమీపంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించేందుకు సహితం ఎందరో ప్రతిరోజు వారి రాకపోకలు జరుపుకుంటుంటారు. ఇటువంటి ప్రధాన రహదారిలో చందవరం గ్రామంలో వర్షం కురిస్తే రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికార పార్టీ నేతలు ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతులను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రనజలు విమర్శిస్తున్నారు. పాలకులు, అధికారులు ఎన్నోసార్లు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారే గాని రోడ్డు మరమ్మతుల గూర్చి పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు వర్షం కురిసిన సమయం లో చందవరం గ్రామంలోని రోడ్డుపై ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్ష్యంగా చూసి తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కురిచేడు - దొనకొండ రోడ్డు ప్రమాదకరం

కురిచేడు : కురిచేడు - దొనకొండ రోడ్డు గుంతల మయంగా మారి అధ్వానంగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కురిచేడు పొట్లపాడు గ్రామాల మధ్య మోకాళ్ల లోతున పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ద్విచక్రవాహనదారులు రాత్రి సమయాలలో ప్రయాణం చేయాలంటే భయాందోళనలకు గురి అవుతున్నారు. పెద్ద వాహనాలు గుంతలలో గుండా ప్రయాణించే సమయంలో కమాన్‌ కట్టలు విరిగి వాహనాలు రోడ్డుమీదనే ఆగి రాకపోకలకు ఇబ్బందులుగా మారుతున్నాయి. ఎపుడో అయిదు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం పూర్తి కాగా ఇంత వరకు రోడ్డుకు మరమ్మతులు కూడా చేయలేదు. సంవత్సరం క్రితం నరసరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ వారు వారి పాఠశాల బస్సులో వెళ్తూ గుంతలలో బస్సు అదపు తప్పి రోడ్డు దిగి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలు అయ్యాయి. నిత్యం ఈ రోడ్డు గుండా వందలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. గుంతల మయంగా మారిన రోడ్డుపై ప్రయా ణం చేయాలంటే కష్టంగా ఉందని వారు వాపోతున్నారు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ప్రయాణీకులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. కురుచేడు-దొనకొండ రోడ్డును పునః నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

బాబోయ్‌ దారులు..!

ముండ్లమూరు : మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నాయి. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు పడడంతో నరకం చూస్తున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతల రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. గుంతలో నీరు చేరి ఉండడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఐదు నిమిషాలు పట్టే ప్రయాణం అరగంట నుంచి గంట పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు రోడ్లవైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు నిత్యం ఆ రహదారిపై వెళ్తున్నా స్పందించిన పాపాన పోలేదు. పెద ఉల్లగల్లు నుంచి వేముల వెళ్లే ప్రధాన రహదారి వానలకు ధ్వంసమైంది. రాజగోపాలరెడ్డినగర్‌ వద్ద బ్రిడ్జి సమీపంలో పెద్ద పెద్ద గోతులు పడి ఇబ్బందులు పడుతున్నారు. 12 కిలో మీటర్లు ఉన్న ఈ రహదారి కేవలం పది నిమిషాల్లో గమ్యం చేరుకోవాల్సిన వాహన చోదకులు రోడ్డు దుస్థితి వల్ల అరగంటకు వెళ్తున్నారు. పసుపుగల్లు నుంచి వయా వేములబండ మీదుగా రమణారెడ్డిపాలెం రహదారి, పసుపుగల్లులో సిమెంట్‌ రోడ్డుపై పలు చోట్ల పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. వర్షానికి నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నా యి. రాత్రి ఏడు గంటల సమయం దాటితే గ్రామస్థులందరూ ఆ రహదారి పై నడవలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప సుపుగల్లు వరకు సిమెంట్‌ రోడ్డును నిర్మించారు. ఆ తరువాత వేములబండ వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డును నిర్మించారు. వేముల బండ నుంచి రమణారెడ్డిపాలెం వెళ్లే ఆ రహదారి బురదమయమైపోయింది. పెదరావిపా డు నుంచి నాయుడుపాలెం వెళ్లే మూడు కిలో మీటర్ల పం చాయతీ రహదారి అడుగుకో గుంతతో ఉంది. కొక్కెర కొండాయపాలెం నుం చి బసవాపురం వయా శ్రీనివాసనగర్‌ వెళ్లే పంచాయతీ రాజ్‌ రహదారి అధ్వానస్థితికి చేరింది. మండలంలోని పలు ప్రధాన రహదారుల దుస్థితి వైసీపీ ప్రభు త్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలైనా కనీసం మరమ్మతులు చేయక పోవడంతో మండలం నుంచి ప్రజలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎస్‌పురం - ఆర్‌కే పల్లి రోడ్డు దుస్థితి

సీఎ్‌సపురం : శివాలయం మీదుగా మండల కేంద్రమైన సీఎ్‌సపురం నుంచి ఆర్‌కే పల్లి గ్రామానికి వెళ్లే రహదారి గుంతలు పడి బురదగా మా రింది. దీంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి బాగుంటే ఆర్‌.కె.పల్లి వెళ్లే ప్రయాణికులకు దగ్గర మార్గమవుతుంది. అధికారులు, పాలకులు స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-09-06T22:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising