ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిన్నరలో రూ.5కోట్ల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ

ABN, First Publish Date - 2023-05-09T23:27:18+05:30

జిల్లాలో ఏడాదిన్నరగా చోరీకి గురైన రూ.5కోట్ల విలువ చేసే 3,447 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. వాటిని బాధితులకు అందజేశామని చెప్పారు. సెల్‌ఫోన్‌ చోరీలు అధికమైన నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేకంగా మిస్సింగ్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

బాధితులకు ఇచ్చిన సెల్‌ఫోన్లతో ఎస్పీ, ట్రైనింగ్‌ ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3,447 మంది బాధితులకు అందజేత

ప్రత్యేకంగా మిస్సింగ్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టం

9121102266 నంబర్‌లో కాల్‌ చేయవచ్చు 8 ఎస్పీ మలికగర్గ్‌ వెల్లడి

ఒంగోలు (క్రైం), మే 9 : జిల్లాలో ఏడాదిన్నరగా చోరీకి గురైన రూ.5కోట్ల విలువ చేసే 3,447 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. వాటిని బాధితులకు అందజేశామని చెప్పారు. సెల్‌ఫోన్‌ చోరీలు అధికమైన నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేకంగా మిస్సింగ్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 2021 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు 7,564 ఫిర్యాదులు అందగా అందులో 3,447 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు చెప్పారు. వాటిలో 142 సెల్‌ఫోన్‌లను మంగళవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె స్వయంగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వారు వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తే వారి ఫోన్‌ను ట్రేస్‌చేసి రికవరీ చేస్తామన్నారు. వాట్సాప్‌ నెంబర్‌ 91211 02266కు కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సెల్‌ఫోన్‌ల రికవరీలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్సై కె.అజయ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు మాలిక్‌, సూలాలయ్య, అవినా్‌షలను ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అంకిత సురాన, అదనపు ఎస్పీ (క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బి.మరియదాసు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-09T23:27:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising