పోలేరమ్మ ఆలయ పునర్నిర్మాణం
ABN, First Publish Date - 2023-03-09T22:39:46+05:30
మండలంలోని రామకూరు గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి గురువారం భూమి పూజ చే శారు. సుమారు రూ.25 లక్షల వ్యయ అంచనాతో గ్రామస్థులు ఆలయ ని ర్మాణానికి శ్రీకారం చుట్టారు.
గ్రామస్థుల ఆధ్వర్యంలో భూమిపూజ
పంగులూరు, మార్చి 9 : మండలంలోని రామకూరు గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి గురువారం భూమి పూజ చే శారు. సుమారు రూ.25 లక్షల వ్యయ అంచనాతో గ్రామస్థులు ఆలయ ని ర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుపతికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ వారు ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు సమకూర్చగా, గ్రామస్థులు ఇతర దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భూమిపూజ సందర్భంగా రాయిణి సుబ్బారావు, గోవిందమ్మ, నార్నె రామాంజనేయులు, సరిత దంప తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మానం సుబ్బారావు, వెంకటరావు, నల్లపాటి చంద్రయ్య, మానం రమేష్ బాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-09T22:39:46+05:30 IST