పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో
ABN, First Publish Date - 2023-03-02T22:30:31+05:30
కురిచేడులోని ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాలను కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎన్నెస్పీ కాలనీలోని వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల కేంద్రాలను ఆయన పరిశీలించారు.
కురిచేడు, మార్చి 2: కురిచేడులోని ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాలను కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎన్నెస్పీ కాలనీలోని వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తరువాత ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే తీరు, ఎలా జరపాలి అనే విషయమై రివ్యూ చేశారు. పడమర నాయుడుపాలెం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ఉన్నత పాటశాలలకు స్థల వివాదాల గురించి గ్రామస్తులతో మాట్లాడి పరిష్కార దిశగా పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ నాగుల్ మీరా, డీటీ రాధాకృష్ణ, ఎన్నికల డీటీ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు, మండల విద్యాశాఖాధికారి వస్రాం నాయక్ ఉన్నారు.
Updated Date - 2023-03-02T22:30:31+05:30 IST