ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన డీఈవోగా రమేష్‌

ABN, First Publish Date - 2023-02-11T23:51:39+05:30

జిల్లా విద్యాశాఖాధికారిగా పి.రమేష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్‌ గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయన్ను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకూ డీఈవోగా పనిచేసిన బి.విజయభాస్కర్‌ను బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయభాస్కర్‌ బదిలీ

ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం

ఒంగోలు (విద్య), ఫిబ్రవరి 11 : జిల్లా విద్యాశాఖాధికారిగా పి.రమేష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్‌ గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయన్ను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకూ డీఈవోగా పనిచేసిన బి.విజయభాస్కర్‌ను బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించారు. ఇప్పటికే విద్యాశాఖలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా ఉద్యోగోన్నతి పొందిన విజయభాస్కర్‌ లోయర్‌ క్యాడర్‌ పోస్టు అయిన డీఈవోగా పనిచేస్తున్నారు. సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా, డైట్‌ ప్రిన్సిపాల్‌గా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఈవోగా విజయభాస్కర్‌ సమర్థవంతంగా పనిచేశారు. గత ఏడాది 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథములుగా నిలిచారు. విద్యాశాఖలో ప్రభుత్వ పథకాల అమలులో చురుగ్గా పనిచేశారు. నూతన డీఈవోగా నియమితులైన రమేష్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - 2023-02-11T23:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising