ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కినకాడికి స్వాహా!

ABN, First Publish Date - 2023-03-02T02:06:26+05:30

పంచాయతీల నిధులు పక్కదారి పడుతున్నాయి. కొన్ని పంచాయతీల నుంచి ప్రభుత్వం లాగేసుకోగా మిగిలిన 15వ ఆర్థిక సంఘం నిధులను అధికారులు, పాలకవర్గాలు కలిసి అప్పనంగా కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పంచాయతీల్లో యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం

కార్యదర్శులు, సర్పంచ్‌లు కుమ్మక్కు

అనేకచోట్ల ఫిర్యాదుల వెల్లువ

ఆరోపణలు వచ్చిన వాటిపై విచారణలు

అమ్మనబ్రోలులో రూ.6.80 లక్షలు రికవరీ

ఇంకా 20కుపైగా పంచాయతీల్లో అక్రమాలు

అధికారుల పర్యవేక్షణ కొరవడటమే కారణం

సింగరాయకొండ పంచాయతీలో కార్యదర్శి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బాలయోగినగర్‌ వాసులు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవో పద్మ గత శుక్రవారం విచారణ చేపట్టారు. రూ.14 లక్షలకు సంబంధించిన బిల్లులను స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయలేదని తేల్చారు.

కురిచేడు పంచాయతీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన స్వీపర్‌ పెన్షన్‌ ఫండ్‌కు జమచేయాల్సిన పంచాయతీ కంట్రిబ్యూషన్‌ రూ.4.31లక్షలను కార్యదర్శి కాజేశారు. శుద్ధి జలకేంద్రం నిధులు రూ.7లక్షలు కూడా మాయయ్యాయనే ఆరోపణలు రావడంతో కనిగిరి డీఎల్పీవో విచారణ చేస్తున్నారు.

కురిచేడు మండలంలో నుంచి దర్శి వెళ్లే రోడ్డులో ఉన్న ఒక పంచాయతీలో పనులు చేయకుండానే నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కురిచేడుకు దగ్గరగా ఉన్న ఓ పంచాయతీలో గత ఐదేళ్లుగా ఇంటి పన్ను మొత్తాలను ఖజానాలో జమచేయకుండా చేతివాటం ప్రదర్శించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే కొండల అవతల ఉన్న ఒక పంచాయతీలో బ్లీచింగ్‌ చల్లకుండానే దొంగ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు గ్రామస్థుల సమాచారం.

ఇదీ జిల్లాలో పరిస్థితి. పంచాయతీల నిధులు పక్కదారి పడుతున్నాయి. కొన్ని పంచాయతీల నుంచి ప్రభుత్వం లాగేసుకోగా మిగిలిన 15వ ఆర్థిక సంఘం నిధులను అధికారులు, పాలకవర్గాలు కలిసి అప్పనంగా కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 20కుపైగా పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. ఇంకా చాలా గ్రామాల్లో స్వాహాపర్వం నడిచినట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 1 : గ్రామ పంచాయతీల్లో ఉన్న అరకొర నిధులను పాలకవర్గాలు, అధికారులు కమ్మక్కై దుర్వినియోగం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక పంచాయతీల్లో నిధులు దిగమింగిన వ్యవహారాలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి ఇష్టారీతిన దారిమళ్లిస్తున్నారు. కొన్నిచోట్ల కలిసి పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపై సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనం. ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తే అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఆ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసి నిధుల రికవరీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేసిన రూ.6.80లక్షలను పంచాయతీకి జమ చేశారు. ఇలా జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో వాటిపై నిగ్గుతేల్చేందుకు డీఎల్‌పీవోలను విచారణాధికారులుగా నియమించారు.

అంతా దారిమళ్లింపే..

జిల్లాలో గత పదిరోజుల్లోనే నిధుల దుర్వినియోగంపై సింగరాయకొండ, కురిచేడు మండలాల్లో అధికారులు విచారణ చేపట్టారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కొందరు పక్కదారి పట్టించారు. అనేక పంచాయతీల్లో అక్రమంగా ఇతరుల అకౌంట్లలో జమచేశారు. తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ పంచాయతీలో చోటుచేసుకున్న అక్రమమే ఇందుకు ఉదాహరణ. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ప్రభుత్వం రూ.55లక్షలు నిధులు మంజూరు చేయగా వాటిని సంబంధిత కాంట్రాక్టర్‌కు కాకుండా సర్పంచ్‌ బంధువుల బ్యాంకు అకౌంట్లకు జమచేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ మరలా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు నివేదించింది. కోర్టు ఆదేశాల మేరకు నిధులను దారిమళ్లించిన సర్పంచ్‌ ఇంద్రసేనారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదుతోపాటు చెక్‌ పవర్‌ను రద్దు చేశారు.

20కు పైగా పంచాయతీల్లో..

జిల్లావ్యాప్తంగా సుమారు 20కిపైగా పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకు విచారణలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీల్లో అంతంతమాత్రంగా నిధులు ఉండగా వాటిని సక్రమంగా వినియోగించాల్సిన కార్యదర్శులు అధికారపార్టీ మద్దతుదారుల అండదండలతో ఇష్టారీతిన ఖర్చులు చూపిస్తూ నొక్కేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఆయా పంచాయతీల్లో అక్రమ పద్ధతిలో దారిమళ్లించిన నిధులు రూ.లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో విచారణలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఏదిఏమైనా జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పూర్తిగా దృష్టిసారించారించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-02T02:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!