ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే మహిళలకు ప్రాధాన్యం

ABN, First Publish Date - 2023-08-22T21:44:10+05:30

తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు సముచిత స్థానంతో ప్రాధాన్యత లభిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. 12 రోజులుగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో నగరంలో మహాశక్తి మినీ మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో పాల్గొన్న తెలుగు మహిళలు

తెలుగు మహిళల ఇంటింటి ప్రచారం

కనిగిరి, ఆగస్టు 22: తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు సముచిత స్థానంతో ప్రాధాన్యత లభిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. 12 రోజులుగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో నగరంలో మహాశక్తి మినీ మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక 16వ వార్డులో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్లూ మహాశక్తి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, పథకాలను వివరించారు. ప్రతి ఇంటిలోకి మహిళలకు నెలకు ఏడాదికి రూ.15వేలు చంద్రబాబు అందించడం జరుగుందని వివరించారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా చదివిస్తారన్నారు. ఏడాదికి 3గ్యాస్‌ సిలిండర్లతో పాటు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టనున్నారని వివరించారు. అన్నివర్గాల ప్రజలకు మేలుచేసే టీడీపీని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు కరణం అరుణ, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ వాజిదాబేగం, హసీనా, దొరసాని, వెంకటలక్షమ్మ, సమీరా, నీరజ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T21:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising