ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెలిగొండ పూర్తయితేనే పూలసుబ్బయ్యకు నిజమైన నివాళి

ABN, First Publish Date - 2023-06-24T00:29:00+05:30

వెలిగొం డ ప్రాజెక్ట్‌ పూర్తి చేయించడం ద్వారానే దివంగత పూలసుబ్బయ్యకు నిజమైన నివాళి అర్పించినట్లు అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 23 : వెలిగొం డ ప్రాజెక్ట్‌ పూర్తి చేయించడం ద్వారానే దివంగత పూలసుబ్బయ్యకు నిజమైన నివాళి అర్పించినట్లు అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు వెలిగొండ ప్రాజెక్ట్‌ ఉద్యమ నేత పూలసుబ్బయ్య 36వ వర్థంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహిం చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న పూల సుబ్బయ్య విగ్రహానికి తొలుత నివాళ్లు అర్పిం చారు. అనంతరం పూలసుబ్బయ్య శాంతి భవన్‌లో అందే నాసరయ్య అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో నారాయణ మాట్లాడారు. నిరం తరం కరువు కాటకాలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ప్రాజెక్ట్‌ నీరు మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మళ్లిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు అనుగుణంగా పూలసుబ్బయ్య పెద్దఎత్తున ఉద్యమాలు చేశారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లా డుతూ.. అనేక దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనానికి గురవుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు పెద్దఎత్తున ఉద్యమించాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ సాదిక్‌, సీపీఐ నాయకులు పెద్దన్న, కాశీం, పూలసుబ్బయ్య కుమార్తెలు పూల సుభాషిణి, పూల సునందిని, శ్రీశైలం ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యులు పత్తి వెంగన్న తదితరులు పాల్గొన్నారు.

పూలసుబ్బయ్య సేవలు చిరస్మరణీయం

ఎర్రగొండపాలెం : మార్కాపురం ప్రాంత సీపీఐ నాయకులు వెలిగొండ ప్రాజెక్టు స్ఫూర్తి ప్రధాత మాజీ ఎమ్మెల్యే దివంగత పూల సుబ్బయ్య 36వ వర్ధంతి కార్యక్రమాలు సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం ప్రాంతంలో నిరంతరం పేదప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు పూలసుబ్బయ్య అని అన్నారు. వెలిగొండప్రాజెక్టు కోసం మొదట ప్రతిపాదన చేసి నాయకుడు పూలసుబ్బయ్య అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ.కృష్ణగౌడ్‌, కాపునాయకులు మిడత నరసింహరావు, సీపీఐ మండల కార్యదర్శి కె గురవయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-24T00:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising