ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజే ఉపశమనం

ABN, First Publish Date - 2023-06-01T01:47:12+05:30

జిల్లాలో వర్షపు జల్లుల ఉపశమనం ఒక్క రోజుకే పరిమితమైంది. పశ్చిమ ప్రాంతంలో బుధవారం ఎండలు మండిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమాన మళ్లీ మంటలు

పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు నమోదు

ఒంగోలు, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షపు జల్లుల ఉపశమనం ఒక్క రోజుకే పరిమితమైంది. పశ్చిమ ప్రాంతంలో బుధవారం ఎండలు మండిపోయాయి. చాలా మండలాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలోనే ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు హెచ్‌ఎంపాడు మండలం వేలములపాడులో 42.90 డిగ్రీలు, రెండు గంటలకు కురిచేడులో 42.89 డిగ్రీలు నమోదు కాగా అప్పటికి రాష్ట్రంలో అవే అత్యధికం. మధ్యాహ్నం మూడు గంటలకు కురిచేడులో, సాయంత్రం నాలుగు గంటలకు జువ్విగుంటలోనూ 43.29డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం 2 నుంచి 4గంటల మధ్య ఉప్పలపాడులో 42.42, బొట్లగూడూరులో 42.36డిగ్రీల ఎండ కాచింది. ఇక తర్లుపాడు, మార్కాపురం, వైపాలెం, పీసీపల్లి, వెలిగండ్ల, కనిగిరి, దొనకొండ, కంభం, దోర్నాల, పుల్లలచెరువు, చీమకుర్తి, పొన్నలూరు, కేకేమిట్లల్లోనూ 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వేడిగాలులు కూడా వీయడంతో ఆ ప్రాంత ప్రజలు విలవిల్లాడారు. ఇక ఒంగోలుతోపాటు పరిసర తూర్పుప్రాంతంలో 40డిగ్రీలలోపుగానే ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనం అవస్థలు పడ్డారు.

Updated Date - 2023-06-01T01:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising