ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో బాబు!

ABN, First Publish Date - 2023-06-01T01:37:13+05:30

ప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టి కంపచెట్ల మధ్య వదలిపెట్టి వెళ్లారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం గిద్దలూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోనె సంచిలో శిశువు

రక్షించిన రెవెన్యూ సిబ్బంది

విచారిస్తున్న పోలీసులు

గిద్దలూరు టౌన్‌, మే 31 : అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టి కంపచెట్ల మధ్య వదలిపెట్టి వెళ్లారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం గిద్దలూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది. కంపచెట్ల మధ్యలో గోనె సంచిలో కదులుతున్న బాలుడిని పందులు లాక్కుని వెళ్తుండటాన్ని గమనించిన రెవెన్యూ సిబ్బంది, స్థానికులు అనుమానంతో అటువైపు వెళ్లారు. పందులను తరిమికొట్టి సంచిని విప్పగా అందులో శిశువు కదులుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో డాక్టర్లు శిశువుకు చికిత్సనందిస్తున్నారు. చిన్నారిని గోనెసంచిలో కట్టి వదిలి వెళ్లిన వ్యక్తుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని చూసిన వారు ఎవరై ఉంటారా అని పోలీసులు వైద్యశాఖ, సచివాలయాల ద్వారా ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-06-01T01:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising