ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్‌ది సుస్థిర స్థానం

ABN, First Publish Date - 2023-01-09T23:41:51+05:30

స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా సో మవారం నాటికి 40 సంవత్సరాలు పూర్త యిందని, ఈ రోజు తెలుగు జాతి చర్రితలో నిలిచిపోయే రోజని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ తెలిపారు.

ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 9 : స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా సో మవారం నాటికి 40 సంవత్సరాలు పూర్త యిందని, ఈ రోజు తెలుగు జాతి చర్రితలో నిలిచిపోయే రోజని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ తెలిపారు. తెలుగుదేశం ప్ర భుత్వం ఏర్పాటుతో తెలుగు ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పెను మార్పులు తీసు కొచ్చిన ఘనత అన్న ఎన్టీ ఆర్‌కే దక్కుతుందన్నారు. తెలుగుజాతి ప్రయా ణాన్ని 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వంతో నాటి దారుణ రాజకీ య పరిస్థితులకు ఎన్టీఆర్‌ చరమగీతం పాడారన్నారు. రూ.2కే కిలో బి య్యం, భూమి శిస్తు రద్దు, సింగిల్‌ విం డో విధానం, పటేల్‌ పట్వారీ వ్య వస్థ రద్దు, రూ.50లకే రైతులకు హార్స్‌పవర్‌ విద్యుత్‌, మహిళలకు ఆస్తి హక్కు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు పింఛన్‌లు, జనతా వ స్త్రాలు వంటి అనేక సం క్షేమ, విప్లవాత్మక ప థకా లను అమలు చే సిన ఘనత టీడీపీదే నన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన మహనీయుడు

మద్దిపాడు : తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని మాజీ స ర్పంచ్‌ గంగిశెట్టి నరసింహారావు అన్నారు. సో మవారం నటరాజ కళా కేంద్రంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలవేని నివాళులర్పిం చారు. కార్యక్రమానికి దేవరశెట్టి యలమంద అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా నరసిం హారావు మా ట్లాడుతూ ఎన్టీఆర్‌ పేదలకు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. కార్యక్ర మంలో గంటా కోటేశ్వరరావు, ఈమని సుబ్బా రావు, సీతారామయ్య, శ్రీనివాసరావు, సురేష్‌, ప్రభా కర్‌, కాకుమాను సుబ్బారావు, బడితల వెంక టేశ్వర్లు, దిద్ది రామారావు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయంలో వేడుకలు

టంగుటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక మహాద్భుతం ఆవిష్కృతమైన రోజు నేడేనని మండల తెలుగుదేం పార్టీ అధ్యక్షుడు కామని విజయకుమార్‌ అన్నారు. 1983 వ సం వత్సరం జనవరి 9న ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భం గా టంగుటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి అందరికీ మిఠాయిలు పంచారు.

ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందం, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామని నాగశ్రీను, మండల తెలుగు యువత అధ్యక్షుడు అభిషేక్‌, టీడీపీ నాయకులు కామని శ్రీను, రావివారిపాలెం సుధ, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు భానుచంద్‌, మద్దిరాల వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T23:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising