ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2023-05-02T22:14:53+05:30

మండలంలోని వెల్లంపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యం సేకరించడం, తరలించడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత కోసి సుమారు 20 రో జులు అయినా కొనుగోలులో అధికారులు వేగం పెంచలేదు.

వెల్లంపల్లిలో వర్షానికి తడవకుండా ధాన్యంపై కప్పిన పట్టలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లాల్లో నిల్వలు

వర్షాలతో రైతులకు ఇబ్బందులు

త్రిపురాంతకం, మే 2 : మండలంలోని వెల్లంపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యం సేకరించడం, తరలించడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత కోసి సుమారు 20 రో జులు అయినా కొనుగోలులో అధికారులు వేగం పెంచలేదు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు అయా గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం నిల్వలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. వాన పట్టలు కప్పుకోవడం, అవి కాస్తా గాలులకు, వర్షానికి పక్కకుపోతుండంతో రాత్రింబవళ్లు కల్లాల్లోనే ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో కలిపి సుమారు 25వేల బస్తాల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ధాన్యం తరలించడానికి సుమారు 50 లారీలు కావాల్సి ఉండగా, మంగళవారం ఒక్క లారీ మాత్రమే వచ్చింది.

కొనుగోలులో లోపించిన పారదర్శకత

వెల్లంపలిల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలులో టోకెన్‌ ఇచ్చిన రైతులకు కాకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన రైతుల నుంచి ధాన్యంను సేకరిస్తున్నారు. దీంతో ముందుగా నమోదు చేసుకున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వర్షాలు పడుతుండడంతో ముందస్తుగా టోకెన్‌ పొందిన రైతులు కూడా ధాన్యాన్ని అమ్ముకోవడానికి కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఒకటి, రెండు టోకెన్‌ నంబర్లు పొందిన రైతు బద్దిగం ముసలారెడ్డి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తర్వాత టోకెన్లు పొందిన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుండడం పట్ల బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-02T22:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising