ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాడు-నేడు.. పాడు!

ABN, First Publish Date - 2023-06-26T23:02:05+05:30

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని పదేపదే చెబుతున్న నాడు-నేడు పనులు అత్యంత ఘోరంగా సాగుతున్నాయి. వివిధ పాఠశాలల్లో ప్రారంభించిన పనులు మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. పనులు మధ్యలోనే ఆగిపోయి ప్రభుత్వ నిర్లక్ష్య తీరును వెక్కిరిస్తున్నాయి. విద్యా సంవత్సరం మళ్లీ ఆరంభమైనా తరగతి గదులు అందుబాటులోకి రాలేదు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తికాని తరగతి గదుల భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి మండలంలో నత్తనడకన పాఠశాలల అభివృద్ధి పనులు

గడువు దాటినా పూర్తికాని నిర్మాణాలు

విద్యాసంవత్సరం ఆరంభమైనా అందుబాటులోకి రాని తరగతి గదులు

సరైన వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు

దర్శి, జూన్‌ 26 : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని పదేపదే చెబుతున్న నాడు-నేడు పనులు అత్యంత ఘోరంగా సాగుతున్నాయి. వివిధ పాఠశాలల్లో ప్రారంభించిన పనులు మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. పనులు మధ్యలోనే ఆగిపోయి ప్రభుత్వ నిర్లక్ష్య తీరును వెక్కిరిస్తున్నాయి. విద్యా సంవత్సరం మళ్లీ ఆరంభమైనా తరగతి గదులు అందుబాటులోకి రాలేదు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పనుల లెక్క...

24 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల భవనాలు నిర్మాణం చేపట్టినప్పటికీ ఒక్క పాఠశాలలో కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు.

10 పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం చేపట్టగా ఒక్కటి మాత్రమే నిర్మాణం పూర్తయింది.

16 పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిర్మాణాలు చేపట్టగా 8 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి.

9 పాఠశాలల్లో వంటగదుల నిర్మాణం ఆరంభించగా 6 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి.

16 పాఠశాలల్లో మరమ్మతులు ప్రారంభించగా పదిచోట్ల పూర్తయ్యాయి. ఆరుచోట్ల ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి.

16 పాఠశాలల్లో విద్యుత్‌కు సంబంధించిన పనులు ఆరంభించగా 11చోట్ల మాత్రమే పూర్తయ్యాయి.

మూడు అంగన్‌వాడీ కేంద్రాలకు గాను ఒక్కటి మాత్రమే పూర్తయింది. ఇంకా రెండు చోట్ల నిర్మాణాలు పూర్తి కాలేదు.

దర్శి మండలానికి నాడు-నేడు పథకం కింద ఫేజ్‌-2లో 37 పాఠశాలల్లో 94 పనులకు రూ.18.56 కోట్లు నిధులు గత ఏడాది మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు ఆరంభించారు. దశలవారీగా బిల్లులు అందకపోవటం, సిమెంట్‌ సరఫరా నిలిచిపోవటంలో మధ్యలో నెలల తరబడి పనులు నిలిచిపోయాయి. గడువు ముగిసినప్పటికీ పూర్తికాలేదు. ప్రస్తుతం మళ్లీ విద్యా సంవత్సరం ఆరంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నాడు-నేడు పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. నిర్మాణ సమయంలో సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో ఆ కొద్ది పనికూడా కొన్నిచోట్ల ఇష్టానుసారంగా చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నాడు-నేడు పనుల్లో జరుగుతున్న లోటుపాట్లను గుర్తించి సవరించి కాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లితండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-26T23:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising