లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు
ABN, First Publish Date - 2023-07-15T22:38:59+05:30
టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్ర షె డ్యూల్ ఖరారైంది. ఈనెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీసీపల్లి మండలంలోని వెంగళాపురం సమీపంలో గల పాలేటి గంగమ్మ గుడి వద్ద కనిగిరి నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. అక్కడ గంగాభవాని అ మ్మను దర్శించుకుని పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా పెదఅలవలపాడు గ్రామం నుంచి పాలేటి బ్రిడ్జి వరకు చేరుకుంటుంది. రాత్రికి లోకే్‌షబాబు అక్కడ బస చేస్తారు. 19 వ తేదీ బుధవారం ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తె లుసుకుంటారు.
పీసీపల్లి, జూలై 15 : టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్ర షె డ్యూల్ ఖరారైంది. ఈనెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీసీపల్లి మండలంలోని వెంగళాపురం సమీపంలో గల పాలేటి గంగమ్మ గుడి వద్ద కనిగిరి నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. అక్కడ గంగాభవాని అ మ్మను దర్శించుకుని పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా పెదఅలవలపాడు గ్రామం నుంచి పాలేటి బ్రిడ్జి వరకు చేరుకుంటుంది. రాత్రికి లోకే్‌షబాబు అక్కడ బస చేస్తారు. 19 వ తేదీ బుధవారం ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తె లుసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బ యలుదేరి రామాపురం, బండపాలెం, ఆజీ్‌సపు రం గ్రామాల మీదుగా కనిగిరి మండలంలోని శంఖవరంకు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడ ఆయన క్యాంపుసైట్‌లో బస చేస్తారు. 20వ తేదీ గురువారం బస చేసిన ప్రాం తం నుంచి సాయంత్రం 4.30గంటలకు కనిగిరిలోని చర్చి సెంటర్‌లో బహిరంగ సభలో పా ల్గొంటారు. మీటింగ్ అనంతరం చర్చి సెంటర్ నుంచి యడవల్లి క్రాస్‌రోడ్ వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రికి అక్కడ లోకేష్ బస చేస్తారు. 21వ తేదీ శుక్రవారం యడవల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమై పెదారికట్ల వద్ద మార్కాపురం నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. రూట్‌మ్యాప్ ఖరారు కావడంతో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను శ్రే ణులు వేగవంతం చేస్తున్నాయి. మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పెదఅలవలపాడు సమీపంలోని పాలేటి బ్రిడ్జి వద్ద లోకేష్ బసచేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. అక్కడ భూమిని చదును చేయించారు. అనంతరం శ్రేణులతో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ గంగమ్మ గుడి వద్దకు చేరేసరికి పెద్దఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలకాలని కో రారు. ఆయన వెంట కనిగిరి, పీసీపల్లి మండలాలకు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
యువగళంను విజయవంతం చేయాలి
పామూరు : లోకేష్ పాదయాత్రను శ్రేణు లు విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చా రు. మండలంలోని కంభాలదిన్నె, రావిగుంటప ల్లి, దూబగుంట పంచాయతీల్లో శనివారం పు వ్వాడి పర్యటించారు. లోకేష్ పాదయాత్రపై చ ర్చించారు. పాదయాత్రలో లోకేష్‌తో నడిచే వారు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కమిటీ ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, తెలుగు రైతు మండల కార్యదర్శి మన్నం రమణయ్య, పువ్వాడి వెంకట్‌చౌద రి, గ్రామాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు, పు వ్వాడి రామారావు, జిల్లా అధికార ప్రతినిధి ప్ర సాద్‌రెడ్డి, శివశంకర్, శ్రీనివాసులు, హను మంతురావు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-15T22:38:59+05:30 IST