ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా కాటమరాజు తిరునాళ్ల

ABN, First Publish Date - 2023-03-21T23:58:51+05:30

మండలంలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేనూతల కాటమరాజు తిరునాళ్ల మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

స్వామివారి దర్శనానికి వెళుతున్నభక్తులు,

పెద్దారవీడు, మార్చి 21: మండలంలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేనూతల కాటమరాజు తిరునాళ్ల మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. యాద వుల ఇలవేల్పు కాటంరాజు, గంగాభవానీ అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని ప్రత్యేక విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉదయం అభిషే కం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఽ ద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలకు నగరోత్సవం నిర్వహించారు. భక్తు లు బొల్లావులతో వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు సాం స్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధి కారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

కంభం : కాటమరాజు తిరునాళ్లకు వెళ్లే భక్తులకు కంభం లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు సయ్యద్‌ జాకీర్‌హుస్సేన్‌ ఆద్వర్యంలో మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను అందజే శారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో భక్తులు తరలివెళ్లారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు పులి శ్రీనివాసప్రసాద్‌, చేగిరెడ్డ ఓబులరెడ్డి, పాండురంగారావు, కేశవ, మహబూబ్‌పీరా, బబ్లూ తదితరులు పాల్గొన్నారు. అర్థవడు మండలం నాగులవరంలో టీడీపీ నాయకులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

రాచర్ల : యాదవ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాటమరాజు తిరునాళ్లకు అశేష భక్తులు తరలివెళ్లారు. మంగళవారం రాచర్ల, అనుమలవీడు, ఓబులరెడ్డిపల్లె, సోమిదేవిపల్లె తదితర గ్రామాల నుంచి భక్తిశ్రద్దలతో కాటమరాజుకు తరలివెళ్లారు.

పొదిలి రూరల్‌ : మండలంలోని మూసినది ఒడ్డున ఉప్పలపాడు-ఏలూరు గ్రామాల సమీపంలో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి తిరునాళ్లు సోమవారం వైభవంగా నిర్వహించారు. శ్రీఅభయాంజనేయ స్వామి 13వ వార్శికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు పెట్టారు. ఆలయంలో గో పూజ, ఆకుపూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించారు. దాతలు భక్తులకు పెద్దఎత్తున పులిహోరా, పెరుగుఅన్నం, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. అనంతరం స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఐ సుధాకర్‌ ఆధ్యర్యంలో ఎస్‌ఐ కే.మల్లిఖార్జున్‌ పటిష్ట బందో బస్తు నిర్వహించారు. స్వామివారిని తిలకించేందుకు చుట్టు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. రాత్రికి విధ్యుత్‌ ప్రభలు, కోలాటం, బ్రహ్మంగారి నాటకాలు, పాటకచేరీలు, ఏర్పా టు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-03-21T23:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising