జోరువానలోనూ జోష్
ABN, First Publish Date - 2023-06-26T00:04:38+05:30
జోరు వానలోనూ టీడీపీ నేతల బస్సు యాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రజాభిమానం వెల్లువెత్తింది. పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేసుకుంటూ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర జిల్లాలో ఐదోరోజైన ఆదివారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర ఆరున్నర గంటలకు దోర్నాల మండలం చినగుడిపాడుకు చేరింది.
వెల్లువెత్తిన ప్రజాభిమానం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
జోరు వానలోనూ టీడీపీ నేతల బస్సు యాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రజాభిమానం వెల్లువెత్తింది. పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేసుకుంటూ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర జిల్లాలో ఐదోరోజైన ఆదివారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర ఆరున్నర గంటలకు దోర్నాల మండలం చినగుడిపాడుకు చేరింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు సారథ్యంలో దారిపొడవునా టీడీపీ శ్రేణులు, అభిమానులతోపాటు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. తొలుత దేవరాజుగట్టు వద్ద నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి రోడ్‌షో రూపంలో యాత్ర సాగింది. పెద్దారవీడు మండలం తోకపల్లి వద్ద వెలిగొండ నిర్వాసితుల కాలనీలో నేతలు సెల్ఫీ దిగి ముంపు వాసుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆ తర్వాత రాజంపల్లి కేంద్రీయ విద్యాలయం వద్ద సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఆ తర్వాత మద్దలకట్ట, సానికవరం గ్రామాల వద్ద అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సెల్ఫీలు దిగారు. ఇలా బస్సు యాత్ర దేవరాజుగట్టు నుంచి రచ్చబండ జరిగే చినగుడిపాడు వరకు సాగింది. మార్గమధ్యంలో అన్ని గ్రామాల వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా స్వాగతం పలికారు. కొన్ని గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి టీడీపీ నేతలకు హారతులు పట్టారు. ఆరున్నర గంటల ప్రాంతంలో రచ్చబండ ప్రారంభం కాగా అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. ఆ కార్యక్రమానికి మహిళలు, అందులోనూ ముస్లిం మహిళలు హాజరవడం గమనార్హం. వారంతా వర్షం పడుతున్నా వెళ్లకుండా నేతల ప్రసంగాలు వినడం కనిపించింది. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రి సురేష్ అడ్డుకునే ప్రయత్నంచేయడం, చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడం తెలిసిందే. ఆ ఘటన తర్వాత నియోజకవర్గంలో మరింత చురుకైన పాత్రపోషిస్తున్న టీడీపీ నాయకులు ఐక్యంగా బస్సు యాత్రలో కూడా పాల్గొన్నారు. సీనియర్ నేతలు డాక్టర్ మన్నె రవీంద్ర కూడా కార్యక్రమానికి ఎరిక్షన్‌బాబు పనితీరును కొనియాడారు. ఈకార్యక్రమం తర్వాత రచ్చబండలో పాల్గొనే దామచర్ల జనార్దన్, నేతలు నూకసాని బాలాజీ, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి సురేష్ నియోజకవర్గ అభివృద్ధిని సాధించలేకపోగా, ప్రజల్లో కులమత విద్వేషాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
Updated Date - 2023-06-26T00:04:38+05:30 IST