ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇక సమరమే!

ABN, First Publish Date - 2023-09-24T00:56:55+05:30

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతూ ప్రశ్నించే వారిపైన, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే వారిపైనా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదని టీడీపీ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు మండిపడ్డారు.

ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకులు

ప్రభుత్వ వేధింపులపై ప్రజల్లోకి.. బహుముఖ పోరు

అక్రమ కేసులపై న్యాయపోరాటం

బాధ్యులైన అధికారులపై ప్రైవేటు కేసులు

బాబుకు మద్దతుగా కార్యక్రమాలు మరింత విస్తృతం

టీడీపీ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల భేటీలో నిర్ణయం

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని కేడర్‌కు పిలుపు

ఒంగోలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతూ ప్రశ్నించే వారిపైన, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే వారిపైనా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదని టీడీపీ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు మండిపడ్డారు. దీనిపై బహుముఖ పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపడమే కాక ఆ చర్యను ఖండిస్తూ నిరసనలు తెలిపే వారిని ప్రభుత్వం బెదిస్తున్నదని నేతలు విమర్శించారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లాలో వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. వాటిపై న్యాయపోరాటం చేయడంతోపాటు అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు కూడా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల సమావేశంలో తీర్మానించారు. ఉమ్మడి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి, ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎం.ఎం. కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలు, జిల్లాలో జరుగుతున్న సంఘీభావ కార్యక్రమాలపై చర్చించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లాలో టీడీపీ శ్రేణులు చేస్తున్న సంఘీభావ రిలే దీక్షలు, ఇతర కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తంచేశారు. అదేసమయంలో ప్రభుత్వ వేధింపులపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి వివరించాలని నిర్ణయించారు. ‘బాబుతోనే మేము’ అనే పేరుతో ఇంటింటికి వెళ్లి అక్రమ అరెస్టు, జైలుకు పంపడం ఇతర వేధింపులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలని రెండు రోజుల్లో జిల్లా అంతటా ఈ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు సాంబశివరావు, స్వామి, నూకసాని బాలాజీ మాట్లాడుతూ పది రోజులుగా ఉమ్మడి జిల్లాలో టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసనల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు, కేసులు నమోదుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడువేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలపై ఈ పది రోజుల్లో పోలీసులు కేసులు పెట్టారన్నారు. వాటిలో అత్యంత దారుణంగా హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వారు తెలిపారు. అందుకు బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కూడా ప్రైవేటు కేసులు పెడతామని వెల్లడించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీ నమోదు చేసిన అక్రమ కేసుల వివరాలు తక్షణం పంపాలని కోరారు. అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అధికారుల అండతో అధికారపార్టీ నేతలు అక్రమ పద్ధతుల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని సమావేశంలో పలువురు ఆందోళన వ్యక్తంచేసినట్లు వారు చెప్పారు. వేలసంఖ్యలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపులను అడ్డుకుంటామన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు చర్యలు అడ్డుకోవాలని పార్టీశ్రేణులకు విజ్ఞప్తి చేశారు

Updated Date - 2023-09-24T00:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising