బడి బస్సు బాగుందా?
ABN, First Publish Date - 2023-06-16T23:34:56+05:30
ఫిట్‌నెస్ లేకుండా స్కూలు బస్సులు రోడ్ల మీద తిరిగితే ఊరుకోమని రవాణాశాఖ చెబుతున్నా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాల్లో కదలిక రావడం లేదు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభయ్యాయి. ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిరిగితే కేసులు నమోదు చేస్తామని వేసవి సెలవుల్లోనే ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు చేశారు. పాఠశాలలు ప్రారంభమై ఐదురోజులు అయినా ఇంకా 35శాతం వరకు బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోని పరిస్థితి. జిల్లాలో 1,085 బస్సులు ఉండగా 698 బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు.
ఇప్పటివరకు 65 శాతమే ఫిట్‌నెస్
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
ఒంగోలు(క్రైం), జూన్ 16: ఫిట్‌నెస్ లేకుండా స్కూలు బస్సులు రోడ్ల మీద తిరిగితే ఊరుకోమని రవాణాశాఖ చెబుతున్నా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాల్లో కదలిక రావడం లేదు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభయ్యాయి. ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిరిగితే కేసులు నమోదు చేస్తామని వేసవి సెలవుల్లోనే ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు చేశారు. పాఠశాలలు ప్రారంభమై ఐదురోజులు అయినా ఇంకా 35శాతం వరకు బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోని పరిస్థితి. జిల్లాలో 1,085 బస్సులు ఉండగా 698 బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. ఇంకా 387 బస్సులు ఫిట్‌నెస్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్యం ఈనెల 16 వరకు ఒంటిపూట బడులు పెట్టింది. ఇంకా వేసవి తాపం తగ్గకపోవడంతో 17 నుంచి పూర్తిస్థాయిలో పాఠశాలలో రెండు పూట్ల తరగతులు జరిగే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ఈ నెల 17 నుంచి పాఠశాలల బస్సులపై ప్రత్వేక డ్రైవ్ చేసి ఫిట్‌నెస్ లేని వాటిపై కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
బస్సులు ప్రమాణాలు ఇలా ఉండాలి
పిల్లలు బస్సు ఎక్కేందుకు వీలుగా 300 ఎంఎం ఎత్తులో మొదటి స్టెప్ ఉండాలి
డోరు తీయగానే ఇరుపక్కల రైలింగ్ ఉండాలి
డోరు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తోపాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి.
బస్సులో ప్రయాణం చేసే రూట్ మ్యాప్, విద్యార్థుల చిరునామాలతో కూడిన రికార్డు ఉండాలి.
బస్సు డ్రైవర్ 60 ఏళ్లు పైబడిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదు.
డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసిన నివేదికలు బస్సులో అందుబాటులో ఉంచాలి.
-స్కూలు పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో సహా కనిపించే విధంగా బస్సుపై రాయాలి.
-విద్యార్థులు ప్రయాణం చేస్తున్నట్లు తెలిసే విధంగా ఖచ్చితంగా బస్సుపైన విద్యార్థుల బొమ్మలు వేయాలి.
-పరిమితికి మించి ఎక్కించకూడదు.
-బస్సులో అటెండెంట్‌తో పాటుగా, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి
నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్: డీటీసీ
ఫిట్‌నెస్ లేకుండా స్కూలు బస్సులు రోడ్లపైన తిరిగితే ఊరుకునేది లేదని రవాణాశాఖ ఉప కమిషనర్ రాయిపూడి సుశీల హెచ్చరించారు. ఇప్పటికే స్కూలు బస్సులు తనిఖీలు చేస్తున్నామని, శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫిట్‌నెస్ లేకుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు. జిల్లాలో 1,085 స్కూలు, కళాశాల బస్సులు ఉన్నాయని 698 బస్సులు ఫిట్‌నెస్ చేశామని చెప్పారు. మిగిలిన బస్సుల యజమానులకు ఫిట్‌నెస్ చేయించుకోమని సమాచారం ఇస్తున్నామన్నారు.
Updated Date - 2023-06-16T23:34:56+05:30 IST