ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు

ABN, First Publish Date - 2023-06-07T01:05:40+05:30

: ఎర్రగొండపాలెం దశబంధం ఇరిగేషన్‌ చెరువు నుంచి ఇటుకల బట్టీల వ్యాపారులు రాత్రి సమయంలో యథేచ్ఛగా మట్ట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న బట్టీల వ్యాపారులు

ఎర్రగొండపాలెం, జూన్‌ 6 : ఎర్రగొండపాలెం దశబంధం ఇరిగేషన్‌ చెరువు నుంచి ఇటుకల బట్టీల వ్యాపారులు రాత్రి సమయంలో యథేచ్ఛగా మట్ట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ తవ్వకానికి వీరికి ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ, నిత్యం తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి వేళలో చెరువులో ఎక్సకవేటర్‌ ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో లోడ్‌ చేసి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.

ఈ అక్రమ తరలింపు సమయంలో చెరువులో ఇష్టానుసారం గోతులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పశువుల కాపరులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరికి అనుమతులు లేకపోవడంతో మున్సిపాలిటీకి ఇలాంటి రుసుము కూడా రావడం లేదు. ఇలా నిత్యం అక్రమ తరలింపు జరుగుతున్నప్పటికీ, అధికారులు కన్నేత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ట్రాక్టర్ల మోతతో నిద్రకు దూరం

రాత్రివేళలో ట్రాక్టర్ల మోతతో ట్రాక్టర్లు వెళ్లే దారి వెంబడి ప్రజలకు నిద్రకు దూరమవుతున్నారు. ఎర్రగొండపాలెంలోని ప్రధాన హైవే రోడ్డు, ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రోడ్డుకు ఇరువైపుల ఉండే కుటుంబాలు రాత్రి టాక్టర్ల శబ్ధానికి ఇబ్బందులు పడుతున్నారు.

అనుమతులు లేవు

ఎర్రగొండపాలెం చెరువులో మట్టితోలుకోవడానికి రైతులు మాత్రమే పర్మిషన్‌ తీసుకొని పోలాలకు మట్టి తోలకం చేసుకోవాలని ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎర్రగొండపాలెం చెరువులో ఎవరు పర్మిషన్‌ తీసుకోలేదని అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరిగేషన్‌ ఏఈ

Updated Date - 2023-06-07T01:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising