ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉన్నత సమాజ నిర్మాణమే మానవత ధ్యేయం

ABN, First Publish Date - 2023-09-18T01:49:34+05:30

ఉన్నత సమాజ నిర్మాణమే మానవత స్వచ్ఛంద సంస్థ ధ్యేయ మని సంస్థ వ్యవస్థాపకుడు ఎన్‌.రామచంద్రా రెడ్డి అన్నారు.

పొదిలి, సెప్టెంబరు 17 : ఉన్నత సమాజ నిర్మాణమే మానవత స్వచ్ఛంద సంస్థ ధ్యేయ మని సంస్థ వ్యవస్థాపకుడు ఎన్‌.రామచంద్రా రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి సదన్‌లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారరోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. కులం, మతం, అనే తేడాలేకుండా, రాజకీ యాలకు అతీతంగా తమ స్వచ్ఛంద సేవాసంస్థ ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 103 మండలాల్లో ఎనలేని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. ఆపదలో ఉన్న వారికి అనేకరకాలైన సహాయ సహకారాలతో అందిస్తూ ప్రజల ముందుకు చేరడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఆ విధంగా దిగ్విజయంగా ముందుకెళుతునన్న సంస్థకు అందరి సహకారం అందడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేద ప్రజలకు, ఆపదలో ఉన్నవారికి తోచిన సాయం చేయాలని సూచించారు. అంబులెన్స్‌లతో పాటు శాంతిరధాలు, రక్తదాన శిభిరాల్లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. పొదిలి, అద్దంకి, దర్శి ఒంగోలు లాంటి ప్రాంతా లలో కొత్తశాఖలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మర్రి పూడి ఎంపీపీ వాకావెంకటరెడ్డి, పొదిలి సభ్యులు యలమందారెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, కాటూరి పెదబాబు, గునుపూడి భాస్కర్‌, గును పూడి చెంచు సుబ్బారావు, రాము సామంత పూడి నాగేశ్వరరావు, మువ్వల పార్ధసారధి, వినోద్‌, రోటి, బండి అశోక్‌ వివిధ సంఘల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T01:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising