ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేములబండలో గుప్త నిధుల కలకలం

ABN, First Publish Date - 2023-02-06T23:16:26+05:30

ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామానికి చెం దిన దుగ్గినేని కృష్ణమ్మకు చెందిన పాడుబడిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుప్త నిధుల కోసం తవ్వకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడుబడిన ఇంటిలో ఐదు అడుగుల తవ్వకం

పోలీసుల అదుపులో అనుమానితుడు

ముండ్లమూరు, ఫిబ్రవరి 6 : మండలంలోని వేములబండ గ్రామానికి చెం దిన దుగ్గినేని కృష్ణమ్మకు చెందిన పాడుబడిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల క్రితం మండలంలోని పెదఉల్లగల్లు, వేములబండ గ్రా మాలకు చెందిన కొందరు కలసి రహస్యంగా పాడుబడిన ఇంటిలోకి వెళ్లి ఐదు అడుగుల లోతు తవ్వారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చివరకు పోలీసుల వద్దకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని తహసీల్దార్‌ ఎస్‌ ఉషారాణి ఎదుట హాజరు పరిచారు. ఆ ఇంటి లో విలువైన నిధి ఉన్నట్టు కొన్ని నెలల నుంచి గ్రామంలో వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తవ్వకాలు చేయటంతో గ్రామంలో చర్చనీయాంశమైం ది. ఈ విషయమై ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా ఇంటిలో తవ్విన మాట వాస్తమేనని, అనుమానితులు ఆ ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి కొందరి వద్ద డబ్బులు కాజేసేందుకు అలా చేసి ఉంటారని చెప్పారు.

Updated Date - 2023-02-06T23:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising